twitter
    CelebsbredcrumbSathyarajbredcrumbBiography

    సత్యరాజ్ బయోగ్రఫీ

    సత్యరాజ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. సత్యరాజ్ 3 అక్టోబరు 1954న సుబ్బయ్యన్, నదంబాళ్ దంపతులకు కోయంబత్తుర్ లొ జన్మించాడు. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలుచేశారు. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం లాంటి సినిమాల్లో నటించాడు.


    తెలుగులొ లక్ష్మి పుత్రుడు, మిర్చి, తుంగభద్ర, నేను శైలజ, బ్రహ్మోత్సవం, హైపర్, బాహుబలి ది బిగినింగ్,  బాహుబలి ది కన్ క్లూజన్ వంటి చిత్రాలలో నటించాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలొని కట్టప్ప పాత్రకి ప్రపంచమంత అభిమానులను సంపాదించారు. 1979లొ మహేశ్వారిని వివాహంచేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె దివ్య మరియు కుమారుడు సిబిరాజ్. ఇతడి కుమారుడు కూడ నటుడు. సిబిరాజ్ తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X