twitter
    CelebsbredcrumbSrikanthbredcrumbUnknown Facts

    Unknown Facts

    • 1
      శ్రీకాంత్ గా ప్రసిద్ధిచెందిన మేకా శ్రీకాంత్ (జననం: మార్చి 23, 1968) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించాడు. విరోధి (2011) అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తెలుగు సినిమా నటుల సంఘం మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) లో శ్రీకాంత్ సభ్యుడిగా పని చేశాడు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు వున్నారు
    • 2
      టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయినా ఒక్కో హీరో ఒక్కో టైపు రోల్స్ వేస్తాడు. ఫలానా హీరో ఫలానా పాత్ర చక్కగా చేస్తాడు అనే ముద్ర పడుతుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోలు ఉండేవారు. ఇప్పుడు యాక్షన్ హీరోలు ఎక్కువైపోయారు. అయితే పాతికేళ్లకు నుంచి సినిమాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్.
    • 3

      హీరో శ్రీకాంత్ పేరు చెప్పగానే ఒకప్పుడు మంచి ప్రేమికుడు గుర్తుకొచ్చేవాడు. ఆ తర్వాత ఒక మంచి భర్త పాత్రలో రాణించిన శ్రీకాంత్ గుర్తుకొచ్చేవాడు. నిజానికి శ్రీకాంత్ కు ఫ్యామిలీ హీరోగా మంచి పేరుంది. 1991లో పీపుల్స్ ఎన్ కౌంటర్ అనే మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీతో సినిఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పటికీ శ్రీకాంత్ ఎక్కువగా కుటుంబ కథాచిత్రాల్లోనే నటించాడు.
    • 4
      మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇంటి యజమాని ఇలా ఉంటాడు అనే కేరక్టర్ కి శ్రీకాంత్ చక్కగా సూట్ అయ్యాడు. మంచి భర్త అంటే శ్రీకాంత్ లా ఉంటాడు అనే ఫీలింగ్ కూడా కలిగించాడు శ్రీ. ఫ్యామిలీ స్టోరీతో తీసిన సినిమాల్లోనే కాక సరదాగా పూర్తి స్థాయి కామెడీతో రన్ అయిన మూవీస్ లోనూ యాక్ట్ చేశాడు. అంతేకాదు .. మహా సీరియస్ గా ఉండే రోల్స్ కూడా వేశాడు.
    • 5

      శ్రీకాంత్ కు బాగా పేరు తెచ్చిన సినిమా ఖడ్గం. ఆ సినిమాలో బాగా డెప్త్ తో, మానసిక సంఘర్షణకు లోనైన రోల్ వేశాడు. అలాగే ఆశయం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ, విరోధి వంటి సినిమాల్లో బరువైన పాత్రలే వేశాడు శ్రీకాంత్. తెలుగులో శ్రీకాంత్ 100 మార్క్ ను ఎప్పుడో దాటేశాడు. లేటెస్ట్ గా శ్రీకాంత్ మలయాళీ మూవీలో విలన్ గా చేస్తున్నాడు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X