twitter
    CelebsbredcrumbSumanbredcrumbBiography

    సుమన్ బయోగ్రఫీ

    సుమన్ దక్షిణ భారత సినీ నటుడు. 1980 లలో తమిళ, తెలుగు చిత్రాల్లో రొమాంటిక్ హీరోగా నటించారు.  1959, ఆగష్టు 28న మద్రాసులో జన్మించాడు. ఈయన నీచల్ కులం సినిమాతో రంగప్రవేశము చేసి తెలుగు, తమిళ, కన్నడ మరియు ఆంగ్ల భాషలలో 150కి పైగా సినిమాలలో నటించాడు.

    సుమన్ బాల్యములో మద్రాసులోని చర్చ్‌పార్క్ కాన్వెంటులో కిండర్గార్టెన్ చేరాడు. పాఠశాల విద్య బీసెంట్ థియొసోఫికల్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత పచ్చయప్ప కళాశాలలో ఆంగ్ల సాహిత్యములో బీ.ఏ పట్టభదృడయ్యాడు.

    సుమన్ తుళు, ఆంగ్లము, తమిళము, తెలుగు,కన్నడ మరియు హిందీ బాషలలో ధారాళంగా మాట్లాడగలడు.  హెచ్.ఏ.ఎస్.శాస్త్రి వద్ద సంస్కృతము అభ్యసించాడు. ఇవేకాక ఈయన వీణ మరియు గిటార్ లను వాయించగలడు కరాటేలో బ్లాక్‌ బెల్ట్ ఉంది. 

    ఈయన తెలుగు లో నేటి భారతం, సితార, మొరుపు దాడి, నేరం నాది కాదు, పెద్దింటి అల్లుడు, సాహస పుత్రుడు, రాముడు కాదు రాక్షసుడు, బావ బావమరిది, చిన్న అల్లుడు, హాలో అల్లుడు, అబ్బాయిగారు, ఏవండి పెళ్ళిచేసుకొండి, అల్లరి పెళ్ళికొడుకు, అన్నమయ్య వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X