twitter
    CelebsbredcrumbTabubredcrumbBiography

    టబు బయోగ్రఫీ

    టబు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, అమెరికన్ చిత్రాల్లో నటించిన అవార్డు గెలుచుకున్న భారతీయ నటి. ఆమె రెండుసార్లు ఉత్తమ నటిగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. బాక్సాఫీస్ విజయాన్ని సాధించడం కంటే అనేక చిత్రాలలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నందుకు ఆమె మంచి పేరు తెచ్చుకుంది.

    అసలు పేరు తబుస్సుమ్ హష్మి. 1971 నవంబరు 4న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి జమాల్ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్ టీచర్. బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. హైదరాబాద్‌లోని సెంట్ ఆన్స్ హై స్కూల్‌లో చదువుకొంది. 

    టబు నటి ఫరాహ్ చెల్లెలు, మరియు నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది.

    తెలుగు లో కూలి నెం 1, నిన్నే పెళ్ళాడుతా, ప్రేమ దేశం, చెన్నకేశవరెడ్డి, షాక్, ఆవిడా మా ఆవిడే, పాండురంగడు, ఇదీ సంగతి మొదలగు చిత్రాలలో నటించారు. 

    ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో అల వైకుంఠపురములో నటిస్తోంది. 

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X