twitter
    CelebsbredcrumbTrisha Krishnan
    త్రిష కృష్ణన్

    త్రిష కృష్ణన్

    Actress
    Born : 04 May 1983
    Birth Place : తమిళనాడు
    త్రిష కృష్ణన్ 1983 మే 4 చెన్నై, తమిళనాడులో పుట్టింది. త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్... ReadMore
    Famous For
    త్రిష కృష్ణన్ 1983 మే 4 చెన్నై, తమిళనాడులో పుట్టింది. త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
    ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం. తరువాత ఈమె నమో వెంకటేశ, నీ మనసు నాకు తెలుసు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే తదితర సినిమాల్లో నటించింది.
    Read More
    • పొన్నియన్ సెల్వన్ 2 తెలుగు ట్రైలర్
    • పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్
    • 1
      దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో త్రిష ఒకరు.
    • 2
      తమిళనాడుకు చెందిన ఈమె.. క్రిమినల్ సైకాలజీలో పట్టా అందుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలోకి అడుగెట్టింది. అప్పుడే మిస్ మద్రాస్‌గా ఎంపికైంది.
    • 3
      ఆ తర్వాత జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ‘మిస్ బ్యూటీఫుల్ స్మైల్' అవార్డును అందుకుంది.
    • 4
      మోడలింగ్‌లో సత్తా చాటిన త్రిష.. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో పదహారేళ్ల వయసులోనే ‘జోడీ' అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది.
    • 5
      యునిసెఫ్‌ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష నియమితురాలైన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్‌ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్‌ టీకా ఆవశ్యకతపై యాడ్‌ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్‌ తరఫున తమిళనాడు, కేరళ చిన్నారుల హక్కుల రాయబారిగా ఆమెను నియమించింది.
    • 6
      తరుణ్ నటించిన 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన ఈ అమ్మడు.. రెండో చిత్రం 'వర్షం'తో మొదటి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె చేసిన నటనకు ఎన్నో అవార్డులు, అవకాశాలు దక్కాయి.
    • 7
      ఆ తర్వాత పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈమె.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పట్లో భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డులకు కూడా ఎక్కింది.
    • 8
      ఈ మధ్య తమిళ సినిమాలకే పరిమితం అయిపోయిన త్రిష.. వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. దాదాపు ఇరవై ఏళ్లుగా సినిమాల్లో తనదైన మార్క్ చూపించింది
    • 9
      చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది త్రిష. ఈ క్రమంలోనే ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'లో అవకాశం వచ్చింది. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా నుంచి తప్పుకుందామె. దీంతో మెగా ఫ్యాన్స్ త్రిషపై ఫైర్ అయ్యారు. ఇక్కడ సినిమాలు చేయకున్నా.. ఆమె తమిళంలో పలు సినిమాలు ఒప్పుకుని ముందుకు సాగుతోంది.
    త్రిష కృష్ణన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X