twitter
    CelebsbredcrumbUday KiranbredcrumbBiography

    ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ

    ఉదయ్ కిరణ్ తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా మొదట వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు. 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు.

    తేజ తీసిన 'చిత్రం' సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు.అంతేకాకుండ ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను ఇంకా మనసంతా నువ్వే ఈ సినిమాలన్ని వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్రకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నటనను ప్రదర్శించాడు కిరణ్. శ్రీరాం సినిమా ద్వారా ఒక పరిపక్వ నటనను మనకు చూపిస్తాడు. చిత్రం, నువ్వునేను, ఔనన్నా కాదన్నా, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు.

    ప్రజల గుండెల్లొ చిర స్ఠాయిగా నిలిచిపోయో సినిమాలు చేసి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని అందరికి అందనంతదూరంగా వెళ్ళిపోయాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X