twitter
    CelebsbredcrumbVijaya Nirmala
    విజయ నిర్మల

    విజయ నిర్మల

    Actress/Director/Producer
    Born : 20 Feb 1946
    1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయ నిర్మల తండ్రిది చెన్నై. తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నరసరావు పేట. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు.... ReadMore
    Famous For
    1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయ నిర్మల తండ్రిది చెన్నై. తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నరసరావు పేట. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు

    విజయ నిర్మల బాలనటిగా కెరీర్ ప్రారంభించి, సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి.పంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి...
    Read More
    • 1
      1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో జన్మించారు. విజయ నిర్మల తండ్రిది చెన్నై. తల్లిది మాత్రం గుంటూరు జిల్లా నరసరావు పేట.
    • 2
      ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు
    • 3
      విజయ నిర్మల బాలనటిగా కెరీర్ ప్రారంభించి, సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
    • 4
      పంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు.
    • 5
      విజయనిర్మల మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, బోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష, మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.
    • 6
      సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.
    • 7

      సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు.
    • 8

      తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (200అందుకున్నారు.
    • 9
      తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు.
    • 10

      విజయ నిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత ఆమె కృష్ణని రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటుడు నరేష్ విజయ నిర్మల కొడుకు. ఆమె మొదటి భర్త వలన కలిగిన సంతానం. అప్పటికే కృష్ణ, విజయ నిర్మలకు విడి విడిగా సంతానం ఉండటం చేత వీళ్లిద్దరు మాత్రం సంతానం వద్దనుకున్నారు.
    • 11
      గత కొంత కాలంగా అస్వస్థతతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె (జూన్ 27 20బుధవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.
    విజయ నిర్మల వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X