'1' (నేనొక్కడినే) ఆడియో కి విభిన్నమైన ఏర్పాట్లు... తేదీ
హైదరాబాద్ : మహేష్ తాజా చిత్రం '1' (నేనొక్కడినే) . సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం గోవా తీరంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో ఘనంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 14న ఆడియో పంక్షన్ డేట్ ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో ఒకేసారి ఈ చిత్రం ఆడియో టెలీకాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నట్లు వినికిడి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయంలో ఇంట్రాక్ట్ అయ్యేలా చూస్తారు.
14 రీల్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్. సుకుమార్ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. అక్కడే షూటింగ్ పూర్తికావటంతో గుమ్మిడికాయ కొడతారని సమాచారం. ఇక డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.
అలాగే ఈ చిత్రంలో కృతిసనన్ ఓ టీవీలో న్యూస్ రీడర్‌గా పని చేస్తోంది. ఇందుకోసం ఆమె ఏవో వార్తలు చదువటాన్ని మొన్నా మధ్య రామోజీఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్ హెయిన్స్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications












