twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సీతమ్మ వాకిట్లో...’ కి పది కోట్లు లాసా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్‌బాబుతో కలిసి వెంకటేష్ నటించిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న ఈ చిత్రంపై చాలా అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రంరిలీజ్ కు ముందే పది కోట్లు లాస్ మూట కట్టుకుందని మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అదెలా అంటే ఈ చిత్రం లెంగ్త్ మూడు గంటలకు పైగా ఉండటంతో దాన్ని నిర్దాక్ష్యణంగా కట్ చేసారని, దాదాపు గంటవరకూ కట్ అయ్యిందని, దాని ఖరీదు మినిమం పది కోట్లు అయినా ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఎంత వరకూ ఎడిట్ చేసారని మాత్రం అఫీషియల్ గా తెలియదు.

    ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అంజలి, ప్రకాష్‌రాజ్‌, జయసుధ ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యి చిత్రంపై అంచనాలు బాగా పెంచాయి. దాంతో ఈ చిత్రం ఎలా ఉంటుంది...ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఫ్యాన్స్ లో కాక అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్నాయి. దిల్‌రాజు మాటల్లోనే '' కలిసుందాం రా, మురారి కలిస్తే ఎలా ఉంటుందో 'సీతమ్మ వాకిట్లో...' సినిమా అలా ఉంటుంది, ''అన్నారు.

    ''పేరులోనే కాదు, సినిమాలోనూ తెలుగుదనం కనిపిస్తుంది. ఇద్దరు హీరోలను ఒకే తెరపై చూపించడం మంచి కథ ఉంటేనే సాధ్యం. అలాంటి కథ ఈ సినిమాలో ఉంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేశాము''అని దర్శకుడు చెప్తున్నారు. ఇందులో ఒక్క పాత్ర కూడా వృథాగా ఉండదు. ఒక్క సీన్ వేస్ట్‌గా ఉండదు. అంత పగడ్బందీ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందిస్తున్నాం. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నన్ను దర్శకుడిగా పరిచయం చేసిన ఆయన బేనరులోనే రెండో సినిమా కూడా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్‌, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్‌ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది అన్నారు.

    English summary
    A rumor spread that... As an audience Dil Raju felt that the length of SVSC is too much and ordered for huge cuts. If the sources are to be believed the first cut of SVSC was over 3 hours. To picturize those edited scenes it cost him over 10 crore rupees.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X