నాగచైతన్య చిత్రం '100% లవ్‌' రిలీజ్ ఎప్పుడంటే..

By Srikanya

నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న '100% లవ్‌' చిత్రం ఏప్రియల్ 29 న విడుదల కానుందని విశ్వసనీయ సమచారం. అదే రోజున రానా హీరోగా చేసిన నేనూ..నా రాక్షసి చిత్రం కూడా విడుదల కానుంది. ఇక '100% లవ్‌' గురించి సమర్పకులు అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ....జల్సా, గజిని, మగధీర లాంటి సంచలన విజయాల తర్వాత గీతా ఆర్ట్స్ నుంచి వస్తున్న చిత్రమిది. దర్శకుడు చెప్పిన కథ విని గంటలోనే ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. స్క్రిప్ట్‌పై వంద శాతం పట్టు వున్న దర్శకుడు సుకుమార్. తన గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్, సుకుమార్ కలయికలో వచ్చిన గత చిత్రాల ఆడియోలు ఎలాంటి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆడియో కూడా వాటిని మించే విధంగా వుంటుంది. ఈ నెల మూడోవారంలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరిని కూల్ చేసే లవ్ ఎంటర్‌టైనర్ '100% లవ్‌' అని నిస్సందేహంగా చెప్పవచ్చు అన్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి దర్సకుడు సుకుమార్. సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: సుకుమార్, నిర్మాత: బన్నీ వాసు, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఏడిద రాజా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X