twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘1000 అబద్దాలు’లో ఆ డైలాగుకి సెన్సార్ అభ్యంతరం

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాయిరామ్ శంకర్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వెయ్యి అబద్ధాలు' . ఈ చిత్రానికి సెన్సార్ రీసెంట్ గానే జరిగింది. 'U/A' సర్టిఫికేట్ తో ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ చేసారు. అయితే బోర్డ్ ఓ డైలాగుకు మాత్రం చాలా అభ్యంతరం పెట్టిందని, అది ఉంచాల్సిందే అని దర్శకుడు పట్టుబట్టాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ డైలాగు ఏమిటంటే...'చైనా మరియు పాకిస్ధాన్ మన శతృ దేశాలు '. ఈ డైలాగు తీసేయాలని సెన్సార్ వారు, దర్శకుడు తేజ ఎందుకు తీసేయాలి ..అందులో తప్పేముందని వాదించుకున్నారని,చివరకు సెన్సార్ కు తలవంచి మ్యూచ్ చేసారని చెప్పుకుంటున్నారు.

    చిత్రం గురించి తేజ మాట్లాడుతూ- ''పెళ్లంటే నూరేళ్ల పంట. నూరేళ్ల పంటను పండించడానికి '1000 అబద్ధాలు' అడితే తప్పుకాదు అని మన పెద్దలే చెప్పారు. ఒకరు ఆ మాటనే ఆదర్శంగా తీసుకున్నారు. 1000 అబద్ధాలతో అనుకున్న వ్యక్తిని పెళ్లాడి తమ కలను సాకారం చేసుకున్నారు. ఇంతకీ ఇన్ని అబద్దాలు అడింది అమ్మాయా? అబ్బాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అసలు ఇంతటి కఠోరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం సదరు వ్యక్తికి ఎందుకొచ్చింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం'' అని చెప్పారు.

    ''వినోదాత్మకంగా సాగే కథ ఇది. హీరో పాత్రలో వైవిధ్యం కనిపిస్తుంది'' అని చిత్రవర్గాలు చెబుతున్నాయి. రాజేంద్రప్రసాద్‌తో 'సినిమాకెళ్దాం రండి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ 'వెయ్యి అబద్ధాలు'సినిమాను నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రం కథాంసం ఓ మాట్రమోనీ బ్యూరో చుట్టూ తిరగనుంది.

    ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.

    English summary
    Sai Ram Shankar, Ester starrer ‘1000 Abaddhalu’ censor screening is completed. Censor Board members after some deliberations passed the film with ‘U/A’ certificate after suggesting some cuts. Board objected to the usage of the dialogue that ‘China and Pakisthan mana satru desalu’ and there was heated argument between the director and the officer. Finally the dialogue was muted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X