twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ 'రెబల్' లో అన్ని ఫైట్సా?

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రభాస్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన భారీ చిత్రం 'రెబల్' సెన్సార్ పూర్తయింది. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. నిన్నే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో 11 ఫైట్స్ ఉన్నట్లు సమాచారం. పూర్తిగా పైట్స్ మీదనే ఆధారపడి సినిమా చేసారంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ... ''ఈ సినిమా నిర్మాణం విషయంలో మేం ఎక్కడా రాజీ పడలేదు. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ సినిమా. లారెన్స్ జనరంజకంగా ఈ సినిమాను తీశాడు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలతో క్లాస్ ఆడియన్స్‌కి చేరువైన ప్రభాస్ మళ్లీ తనదైన బాటలోకి వచ్చేసి ఈ పాత్ర చేశారు. 'ఛత్రపతి'ని మించే రేంజ్‌లో సినిమా ఉంటుంది. లారెన్స్ టేకింగ్, తమన్నా, దీక్షాసేథ్‌ల గ్లామర్ ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలువనున్నాయి. అభిమానుల అంచనాలకు అందని రేంజ్‌లో సినిమా ఉంటుంది. సెన్సార్ పూర్తయ్యింది. 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. తప్పకుండా విజయం సాధిస్తుందని మా నమ్మకం'' అన్నారు.

    అలాగే 'మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'రెబల్' చిత్రం సెన్సార్ పూర్తయింది. 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రభాస్ పెర్ఫార్మెన్స్, తమన్నా, దీక్షాసేథ్ గ్లామర్, లారెన్స్ టేకింగ్ హైలైట్స్‌గా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా తయారైంది. ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా ఉంటుంది. చిత్రం తప్పకుండా హిట్ అవుతుందే నమ్మకం ఉంది' అని తెలిపారు. బ్రతుకు మీద ఆశ లేని వాడే రణ రంగంలో అడుగు పెట్టాలి, యమ పాశం అడుగుదూరంలో ఉన్న చిరునవ్వు చిందాలి, అవకాశం వస్తే మాత్రం లక్ష్యం వైపు దూసుకు పోవాలి, చావుకు మస్కా కొట్టి మన పని మనం చేసుకోవాలి దానికి చాలా తెగువ కావాలి...అలాంటి క్యారెక్టర్ ప్రభాస్ ది రెబెల్ లో అంటున్నారు లారెన్స్.

    ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ నటిస్తున్న ఈచిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఓప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ముఖేష్ రుషి, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: డార్లింగ్ స్వామి, ఫోటో గ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, కో-డైరెక్టర్స్: బుజ్జి, కిరణ్, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు, కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

    English summary
    Producers confirm that Rebel will be hitting the marquee on September 28 as planned, and has not been pushed back. Tamanna and Deeksha Seth have played the female leads. Raghava Lawrence, who directed the movie, has also scored the music for this mass entertainer. Rebel, which is currently in post-production stage, is jointly produced by J Bhagawan and J Pulla Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X