KH 234 Movie: హీరోయిన్ ఎవరైనా సరే 12 కోట్లు ఫిక్స్.. ఆ ఇద్దరిలో ఈ ఆఫర్ అందుకునేది ఎవరంటే?

సీనియర్ స్టార్ హీరో కమన్ హాసన్ గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన అందం, అభినయానికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా తెలుసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉంటారు ఆయన ఫ్యాన్స్. ముఖ్యంగా ఆయన నుంచి ఓ కొత్త సినిమా వస్తుందని తెలిస్తే చాలు.. అందులో హీరోహీరోయిన్లు ఎవరు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, నటీనటులు, సినిమా పేరేంటి.. ఇలా ప్రతీ ఒక్కటి తెలుసుకునేందుకు గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తుంటారు. అయితే ఆయన తాజాగా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు.

ముఖ్యంగా గతంలో నాయకుడు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను ఊర్రూతలూగించిన కమల్ హాసన్... మరోసారి ఆ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడితో కలిసి రాబోతున్నారు. మణిరత్నం, కమల్ హాసన్ ఎవర్ గ్రీన్ హిట్టు కాంబో మరోసారి వస్తుండడంతో అందరి ఆసక్తి ఈ సినిమాపైనే పడింది. ముఖ్యంగా ఈ సినిమాలో కమల్ సరసన ఎవరు నటించబోతున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఓసారి నయనతార, మరోసారి త్రిష అంటూ వినిపిస్తోంది. ఇందులో కమల్ సరసన నటించేందుకు ఎవరు ఫిక్స్ అయ్యారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

12 Crore Rupees Of Remunaration Fixed For Heroine of KH 234 Movie Details Here

అయితే KH234 సినిమా కోసం హీరోయిన్ ఫిక్స్ అయినా కాకపోయినా... కథానాయిక రెమ్యునరేషన్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు అవకాశం దక్కించుకున్నా సరే.. వారికి 12 కోట్ల పారితోషికం అందిస్తారనే టాక్ నడుస్తోంది. హీరోయిన్ గా త్రిషను తీసుకున్నా, నయనతారను తీసుకున్నా ఇదే పారితోషికం ఫైనల్ అని మేకర్స్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార పేరు ముఖ్యంగా వినిపిస్తోంది. ఇటీవలే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మెదటి సినిమాకే 10 కోట్లు పారితోషికం అందుకుంది.

ఇక బాలీవుడ్ లో ఓ రెండో సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు గాను నయనతార 12 కోట్ల రూపాయల కావాలని అడిగినట్లు సమాచారం. అందుకే ఆమె అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఇదే ధరను ఫిక్స్ చేసినట్లు అంతా భావిస్తున్నారు. మరోవైపు త్రిషకు నార్త్ లో అంతగా గుర్తింపు లేదు. హిందీలో కొన్ని చిత్రాలు చేసినప్పటికీ... ఆమె అంతగా క్రేజ్ సంపాధించుకోలేక పోయింది. ఇటీవలే వచ్చిన ఆమె చిత్రాలు ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ 2 ఫ్లాప్ గా నిలవడంతో మరింత నిరాశలో కూరుకుపోయిందీ క్యూట్ బ్యూటీ.

12 Crore Rupees Of Remunaration Fixed For Heroine of KH 234 Movie Details Here

కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో రాబోతున్న ఈ చిత్రంలో త్రిషకు గనుక ఛాన్స్ వస్తే ఆమె పంట పండినట్లేనని అంతా అనుకుంటున్నారు. కమల్ సరసన నటించే అద్భుతమైన అవకాశంతో పాటు సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా కూడా ఆమె రికార్డు సాధిస్తుంది. అయితే ఈ ఇద్దరిలో కన్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ నయన తారకే ఎక్కువగా ఉన్నట్లు అంతా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో. ఎవరు సెలెక్ట్ అయి ఇంత పెద్ద ఆఫర్ ను అందిపుచ్చుకుంటారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X