వర కట్నం రూపంలో చెర్రీకి 120 కోట్లు?
తొక్కలో తోటకూరగాళ్లే ఈ మధ్య వరకట్నం కింద కోట్ల కోట్లు గుంజుతున్నారు అత్తింటి వారి నుంచి. అలాంటి సినిమా హీరో, పైగా మెగాస్టార్ తనయుడు, అందాడు, సినిమా సినిమాకు కనీసం ఆరు కోట్లు సంపాదించే సత్తా ఉన్న రామ్ చరణ్ కు అత్తింటి వారి కానుక ఏరేంజ్ లో ఉంటుందో ఊహించండి. సామాన్య జనాల అది ఊహకు అందడం కష్టమే. పది, పాతిక, ఓ యాభై కోట్లు, మహా అయితే వంద కోట్లు అనుకుంటారంతా. కానీ మన అంచనాలను మించి పోయాడు రామ్ చరణ్. మెగాస్టార్ కుటుంబం సన్నిహితుల నుంచి అందిన సమాచారం ప్రకారం చరణ్ కు రూ. 120 కోట్ల విలువ చేసే పెళ్లి కానుక దక్కనుందట. ఇదంతా క్యాషు రూపంలో ఇస్తారు అనుకుంటే పొరపాటే. ఆ డబ్బుకు సమానమైన విలువ చేసే విమానాన్ని చెర్రీకి కొనిస్తున్నారట అత్తింటివారు. ఇదే నిజమైతే పోలో టీంను కొనుగోలు చేసి తన లగ్జరీ జీవితాన్నితెలుగు జనాలకు చాటిన చెర్రీ..త్వరలో సొంత విమానం ఉన్న హీరోగా రికార్డులకెక్కడం ఖాయం.
అపోలో ఆసుపత్రుల యాజమానుల ఫ్యామిలీకి చెందని...ఉపాసన కామినేనిని చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ అత్తింటి వారు కోట్లకు పడగలెత్తిన ఆసాములు. మరి తమ అల్లుడికి తమ స్థాయికి తగ్గట్టు గిఫ్ఠు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో...120 కోట్ల విలువ చేసే ఓ చార్జెడ్ ఫైట్ ను జర్మనీకి చెందిన ఓ విమానాల కంపెనీకి ఆర్డరిచ్చారట.


Click it and Unblock the Notifications











