విక్రమ్ వదిలేసిన ప్రాజెక్టు నితిన్ చేస్తున్నాడు
వరస ఫ్లాపులతో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న నితిన్ తాజాగా మరో చిత్రం పట్టాడు. గతంలో తెలుగులో ఇష్టం సినిమాకు దర్శకత్వం వహించి ఇటీవల 13 బి (మాధవన్, నీతూ చంద్ర) అనే బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించిన విక్రమ్ తన తాజా చిత్రానికి నితిన్ ని హీరోగా ఎంపిక చేసుకున్నాడు. 13 బి తర్వాత విక్రమ్ తన తదుపరి చిత్రం విక్రమ్ తో చేస్తారని అనుకున్నారు. అయితే చివరి నిముషంలో ఆ ప్రాజెక్టు కాన్సిల్ అయింది. విక్రమ్ స్క్రిప్టులో చెప్పిన మార్పులు నచ్చక విక్రమ్ తాను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ చిత్రాన్ని తెలంగాణా రాజకీయనేత ఒకరు నిర్మించనున్నారని సమాచారం. నితిన్ సరసన ఓ స్టార్ హీరోయిన్ ఈ చిత్రంలో నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్ళనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











