పవన్ కళ్యాణ్ తో 80 కోట్లు డీల్?
హైదరాబాద్ : ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం...పవన్ కళ్యాణ్ కొత్త డీల్ గురించి. మహేష్ తో వరసగా చిత్రాలు చేస్తున్న 14 రీల్స్ ఎంటర్టైనమెంట్ సంస్ధ పవన్ తో వరసగా రెండు చిత్రాలు చేయటానికి ముందు కొచ్చిందని, అందు నిమిత్తం 80 కోట్లు భారీ డీల్ ని ఆఫర్ చేసిందని సమాచారం. పవన్ కళ్యాణ్ కి పూర్తి స్వేచ్చ ఇచ్చేలా,దర్శకుడు...కథ అన్నీ ఆయనే పైనలైజ్ చేసుకునేలా ఆ డీల్ ప్రపోజ్ చేసారని చెప్పుకుంటున్నారు. అయితే పవన్ వైపు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. ఈ డీల్ ఓకే అయితే గబ్బర్ సింగ్ సీక్వెల్ అయిన వెంటనే పవన్ తో ప్రాజెక్టు పట్టాలు ఎక్కించాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట.
ఇక 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ప్రస్తుతం బాలకృష్ణతో లెజండ్ చిత్రం నిర్మిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెలలో దుబాయి షెడ్యూల్ ఉంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. బాలయ్యతో 'సింహా' లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడవ్వడం, 'దూకుడు', నేనొక్కడినే లాంటి హిట్ తర్వాత నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం... ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి.ఈ చిత్రంలో లో బాలయ్య పాత్రలో రెండు రకాల కోణాలుంటాయని, అత్యంత శక్తిమంతంగా ఆయన పాత్ర ఇందులో ఉంటుందని సమాచారం.

పవన్ విషయానికి వస్తే ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2'. ఈ చిత్రం ప్రారంభం కావటంలో చాలా జాప్యం జరుగుతూ వస్తోంది. రకరకాల కారణాలతో ఈ చిత్రం ప్రారంభం డిలే అవుతూ వచ్చినా స్క్రిప్టు పరంగా పవన్ కి పూర్తి సంతృప్తి చెందాడని అందుకే మార్చి నుంచి కంటిన్యూ షెడ్యూల్ ప్రాంరంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.
'రచ్చ' సినిమా డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాని దర్శకత్వం వహించనున్నాడు. 2012 లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన 'గబ్బర్ సింగ్' బ్రాండ్ నేమ్ తో ఈ చిత్రం చేస్తున్నారు. సీక్వెల్...ప్రీక్వెల్ కాదు అని చెప్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయనున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు త్వరలోనే ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. గబ్బర్ సింగ్ చిత్రం హిందీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించినప్పటికీ....'గబ్బర్ సింగ్-2' మాత్రం హిందీ దబాంగ్-2ను పోలి ఉండదని అంటున్నారు దర్శకుడు సంపత్ నంది. ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











