గోపీచంద్ దగ్గర ఆ దర్శకుడు కథ ఓకే !?

By Srikanya

యాక్షన్ చిత్రాలు చేయాలనుకునే వారికి గోపీచంద్ మొదటి ఆప్షన్ గా కనపడతారనటంలో సందేహం లేదు. దాంతో యాక్షన్ జెనర్ దర్సకులంతా అతనికే కథలు చెప్తున్నారు. తాజాగా అతన్ని '1977' చిత్రం తీసిన తమిళ దర్శకుడు దినీష్ కుమార్ కలిసి కథ వినిపించి ఓకే చేసుకున్నాడనని సమాచారం. దినేష్ కుమార్ చాలా ఇంటెన్స్ గా కథ చెప్పాడని, మంచి టాలెంట్ ఉన్నవాడని గోపీచంద్ తన సన్నిహితుల వద్ద పొగిడినట్లు సమాచారం. ఈ మేరకు ఆ దర్శకుడుకి గోపీచంద్ సినిమా చేద్దామని హామీ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం చేద్దామనే నిర్ణయమని, ప్రస్తుతం గోపీచంద్ తన దగ్గర ఉన్న ఇద్దరు నిర్మాతల వద్దకు అతన్ని పంపించాడని, ఎవరది ఓకే అవుతుందో చూడాలని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక శరత్ కుమార్, నమిత, ఫర్జానా నటించిన '1977' తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక భవ్య ఆర్ట్స్ వారు ఈ చిత్రం చేసే అవకాశముందని మరో వార్త. ఏదైమైనా అన్నీ కలిసి వస్తే ఈ చిత్రం త్వరలోనే సెట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన గోలీమార్ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X