twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసు పాలిటిక్స్: మహేష్, అల్లు అర్జున్‌కు చుక్కలు చూపిస్తున్నారు!

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఇబ్బందుల్లో పడ్డ మహేష్, బన్నీ ! | Filmibeat Telugu

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు రిలీజ్‌ల విషయంలో సీజన్ సంక్రాంతి, సమ్మర్ సీజన్ చాలా కీలకం. ఈ రెండు సీజన్లలో విడుదలైన సినిమాలకు కలెక్షన్లు భారీగా ఉంటాయి. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి', బాలయ్య నటించిన 'జై సింహ' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వచ్చే సమ్మర్ సీజన్లో మహేష్ బాబు మూవీ 'భరత్ అను నేను', అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాను రిలీజ్ ప్లాన్ చేశారు.

     రోబో 2.0 రాకతో అంతా అస్తవ్యస్తం

    రోబో 2.0 రాకతో అంతా అస్తవ్యస్తం

    అయితే ఉన్నట్టుండి సమ్మర్ సీజన్లోకి రజనీకాంత్ మూవీ 2.0 రావడంతో తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్ అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి ఏర్పడింది. పోస్టుప్రొడక్షన్ పనులు ఆలస్యం అయిన కారణంగా ఏప్రిల్ 27కు 2.0 మూవీ రిలీజ్ డేట్ మార్చారు. దీంతో అదే రోజు విడుదలకు సిద్ధమైన మహేష్ బాబు, బన్నీ సినిమాలు ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డాయి.

     అయిలా చేస్తే మనకే ఎక్కువ నష్టం

    అయిలా చేస్తే మనకే ఎక్కువ నష్టం

    2.0 సినిమాతో పాటు..... భరత్ అను నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు విడుదల చేస్తే.... ఆయా సినిమాలకు థియేటర్ల సంఖ్య తగ్గి నష్టం వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఎఫెక్ట్ మూడు భాషల్లో విడుదలువతున్న రజనీ సినిమా కంటే..... మహేష్, బన్నీ సినిమాలపైనే ఎక్కువ పడనుంది.

     బాక్సాఫీసు రాజకీయం

    బాక్సాఫీసు రాజకీయం

    2.0 తెలుగు రిలీజ్ హక్కులను నైజాం ప్రాంతంలో ఎక్కువ థియేటర్స్ నెట్వర్క్ కలిగిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 27వ తేదీన 2.0 సినిమా విడుదలయ్యేలా బాక్సాఫీసు పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడని సమాచారం.

     పోరాడినా ఫలితం లేదు

    పోరాడినా ఫలితం లేదు

    2.0 నిర్మాతలు ఉన్నట్టుండి విడుదల తేదీ మార్చి తమ సినిమాలను దెబ్బకొడుతున్నారని ‘నా పేరు సూర్య' నిర్మాత బన్నీ వాసు మీడియా ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ దృష్టికి కూడా తీసుకెళతామన్నారు. అయితే ఈ విషయంలో పోరాడినా ఫలితం ఉండదని, సదరు నైజాం డిస్ట్రిబ్యూటర్‌ను కాదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏమీ చేయలేదని, అదే సమయంలో 2.0 రజనీకాంత్ మూవీ కావడం, లైకా ప్రొడక్షన్స్ లాంటి భారీ సంస్థ దాని వెనక ఉండటం వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేదని అంటున్నారు.

    రిలీజ్ డేట్ మార్చుకునే దిశగా మహేష్ బాబు, బన్నీ

    రిలీజ్ డేట్ మార్చుకునే దిశగా మహేష్ బాబు, బన్నీ

    రిలీజ్ ఆలస్యం అయితే పరిస్థితి మరింత కష్టం అయ్యే అవకాశం ఉండటంతో మహేష్ బాబుతో ‘భరత్ అను నేను' సినిమా చేస్తున్న నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య' సినిమాతో చేస్తున్న బన్నీ వాసు మాత్రం తన సినిమా రిలీజ్ విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

    English summary
    April 27th is one mega date locked by Naa Peru Surya and then Bharat Anu Nenu also joined the same date. As per reports, we are hearing, a distributor who owns a mega network of theatres in Nizam area has bought the theatrical rights of Telugu version of '2.0' from Lyca Productions. So naturally, if he's not allowed to release the film on 27th, then he might create troubles for biggies as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X