మహేష్ బాబు: 30 సెకడ్లు కి రెండు కోట్లు

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు కి తన వాల్యూ ఎంతో తనకు తెలుసు. సూపర్ స్టార్ గా ఎదిగిన ఆయనకు కమర్షియల్ గా బిజినెస్ ఎలా చేయాలో తెలుసు. అందుకే ఆయన సినిమాల కన్నా యాడ్స్ ద్వారా ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. రీసెంట్ గా ఆయన 'ఐడియా' యాడ్ చేసారు. అందుకోసం ఆయన ముప్పై సెకడ్లు యాడ్ కోసం రెండు కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. పోలీస్ పాత్రలో ఆయన పోకిరి,దూకుడు,ఇప్పుడు ఆగడు చిత్రాల్లో చేసారు..చేస్తున్నారు. దాంతో ఆయన పోలీస్ గా కనిపించటం అందరికీ నచ్చుతుందనే భావనతో ఐడియా వారు ఆయన్ని తీసుకుని,అందుకు తగిన పేమెంట్ చెల్లించి ప్రకటన పూర్తి చేసారు.

మహేష్ బాబుకి సినిమాలపై కన్నా యాడ్స్ పై దృష్టి బాగా పెరిగిందని రెగ్యులర్ గా టీవీ చూసే వారెవరైనా చెప్పేయగలుగుతారు.ఎందుకంతలా యాడ్స్ మీద మహేష్ అంతలా ఆధారపడుతున్నాడూ అంటే ఆయనకు యాడ్స్ పై వచ్చే ఆదాయం చూస్తే కళ్ళు తిరుగుతుంది. సంవత్సరానికి ఆయన ఆదాయం కేవలం యాడ్స్ లో నటించటం ద్వారా 35 కోట్లు కు పైగానే సంపాదిస్తున్నారని అంచనా.

ఇక మహేష్ బాబు చిత్రం రిలీజ్ కోసం అభిమానులే కాకుండా సామాన్య సినీ జనం సైతం ఆసక్తిగా చూస్తారు. 'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. కృష్ణ జన్మదినం(మే 31) సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

''సినిమాలో అసలు సిసలు మాస్‌ మహేష్‌ని చూస్తారు. దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దారు '' అని నిర్మాతలు తెలిపారు. సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్‌బాబు, వెన్నెల కిషోర్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితర ప్రధాన తారగణంపై హాస్య సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. మహేష్‌ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు

గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X