Pawan Kalyan సినిమా నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. ఆ రెండు కారణాల వల్లే..

ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో పూజా హెగ్డే ఒకరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీకి ఇటీవల వరుసగా డిజాస్టర్స్ వచ్చినప్పటికీ కూడా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు పూజా హెగ్డే వెనుకడుగు వేసినట్లు గా తెలుస్తోంది. అందుకు రెండు ప్రధానమైన కారణాలు కూడా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్గెస్ట్ డిజాస్టర్స్

బిగ్గెస్ట్ డిజాస్టర్స్

అల వైకుంఠపురములో సినిమా తర్వాత బుట్ట బొమ్మ హవా అయితే మామూలుగా లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోలు ఎక్కువగా ఈ బ్యూటీతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా మాత్రం పూజా వరుసగా మూడు సినిమాలతో అపజయాలను ఎదుర్కొంది. విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా, మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమాతో పాటు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా కూడా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. దీంతో వరుసగా పూజా హెగ్డే చాలా కాలం తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ ను చూసింది.

ఆ ఒక్క సినిమా హిట్టయితే..

ఆ ఒక్క సినిమా హిట్టయితే..

అయితే గతంలో ఓకే చేసిన ప్రాజెక్స్ కారణంగా పూజా హెగ్డే క్రేజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీకి మళ్ళీ మంచి అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కూడా బాలీవుడ్ లోకి కబీ ఈద్ కభీ దివాలి అనే సినిమా చేస్తోంది. ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే మాత్రం బ్యూటీ క్రేజ్ మరో రేంజ్ కు వెళ్లిపోయినట్లే అని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ సినిమాలో..

పవన్ కళ్యాణ్ సినిమాలో..

అయితే ఈ బ్యూటీ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ అయితే గట్టిగానే వినిపించింది. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. దాదాపు ఈ కలయిక మొత్తం ఫైనల్ అని కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది.

ఆ కారణం వలన..

ఆ కారణం వలన..

అయితే పూజా హెగ్డే ఇప్పుడు ఆ సినిమాలో నటించడానికి సిద్ధంగా లేదు అని ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు గా మళ్ళీ అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అందుకు రెండు ప్రధానమైన కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది. కాబట్టి ఎప్పుడు మొదలవుతుందో తెలియని భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్టుకు డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని తప్పుకున్నట్లు సమాచారం.

మరొక కారణం ఏమిటంటే?

మరొక కారణం ఏమిటంటే?

అలాగే మరొక టాక్ ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రాజెక్టును ఇప్పట్లో అయితే స్టార్ట్ చేసే అవకాశం లేదని కూడా సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల్లో చాలా బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టినట్లుగా సమాచారం. కాబట్టి ఈ ప్రాజెక్టు అసలు తెరకెక్కుతోందో లేదో అనే అనుమానాల మధ్య చేయడం అనవసరం అని తన సొంత నిర్ణయంతోనే ప్రాజెక్టు లో నుంచి తప్పుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ సభ్యులు ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X