GunturKaraam Movie: మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఫీస్ట్... గుంటూరు కారంలో ఇద్దరు సూపర్ స్టార్స్?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలోకి ఘాటుగా దిగనుంది. అయితే విడుదలకు ముందే మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ న్యూస్ తో సూపర్ స్టార్ ఫ్యాన్సే కాదు.. మరో హీరో ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతులేస్తారు. ఎందుకంటే.. గుంటూరు కారంలో ఒక్కరు కాదు.. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉండనున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. వీరి కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇక వీరి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు.

Recommended Video

Guntur Kaaram Movie లో fan's కి అదిరిపోయే ట్విస్ట్.. గుడ్ న్యూస్ | Telugu FIlmibeat

2 Super Stars Krishna And Mahesh Babu on Screen in Gunturkaram Movie Full Details Here

ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కుర్చి మడతబెట్టి సాంగ్ కు మంచి ఆదరణ వస్తుంది. మొదట ట్రోలింగ్ వచ్చినప్పటికీ.. ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

2 Super Stars Krishna And Mahesh Babu on Screen in Gunturkaram Movie Full Details Here

ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 6న రిలీజ్ చేయనున్నారు. ఇక మొదటి సారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూఎస్ ఏలో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారట. దీనితో మహేశ్ మరో ట్రెండ్ సెట్టర్ గా నిలవనున్నారు. ఇక ఈ సినిమా ఈ పండక్కీ ఇంటిల్లి పాది ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పుకువస్తున్నారు. మ్యూజిక్‌ మరో స్థాయిలో ఉంటుందని... అన్నింటికంటే ముఖ్యంగా చివరి 45 నిమిషాలు, క్లెమాక్స్‌ అదిరిపోయేలా ఉంటాయని ఇంటర్వ్యూలో చెప్పుకువస్తున్నాడు.

2 Super Stars Krishna And Mahesh Babu on Screen in Gunturkaram Movie Full Details Here

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. ఇక ఈ సినిమాలో ఒక్కరు సూపర్ స్టార్ కాకుండా ఇద్దరు సూపర్ స్టార్స్ ఉంటారట. గుంటూరు కారం సెకండాఫ్‌లో ఇద్దరు సూపర్‌స్టార్లు ఒకేసారి తెరపై కనిపించబోతున్నారు. అంటే మహేష్‌బాబుతో పాటు సూపర్‌స్టార్‌ కృష్ణ కూడా కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో కలిసుందాం రా, యమదొంగ సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించారు. సీనియర్ ఎన్టీఆర్ వాళ్లతో కలిసి డ్యాన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

2 Super Stars Krishna And Mahesh Babu on Screen in Gunturkaram Movie Full Details Here

ఇప్పుడు గుంటూరు కారంలో కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉంటారట. ప్రత్యేక టెక్నాలజీని వాడి.. ఆయన్ని ఓ సాంగ్ లో చూపించనున్నారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో కానీ.. టాలీవుడ్ వర్గాల్లో ఈ న్యూస్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫిస్టే అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X