చిరంజీవి వాళ్ళ దృష్టిలో పందెంకోడిగా మారనున్నారు. గోదావరి జిల్లాల బలిజశెట్టి కమ్యూనిటీ వారు చిరంజీవి జయాపజయాలపై భారీ ఎత్తున బెట్టింగ్ లు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన పాలకొల్లులో గెలస్తాడా..గెలవడా అన్నదే ఆ బెట్ లో అంశం. అందుతున్న సమాచారాన్ని బట్టి దాదాపు ఇరవై కోట్ల వరకూ ఆ పందెం మొత్తం పెరిగిందని తెలుస్తోంది. ఇక రిజల్ట్స్ వచ్చే లోగా ఇంకా ఈ మొత్తం పెరిగి రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. పాలకొల్లు నుంచి చిరు పోటీ చేయనుండటంతో అక్కడ కొన్ని వర్గాల్లో పండగ వాతావరణం ఏర్పడింది. అలాగే ఈ నెల సప్సెన్స్ బెట్స్ తో మరితం కిక్ ఇస్తుమందని అందరూ చెప్తున్నారు. ఈ బెట్ కాసిన వారిలో పెద్ద పారిశ్రామిక వేత్తలే కాక కొబ్బిరి కాయల వ్యాపారస్తులు సైతం ఉన్నారని టాక్.