twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2009 చెత్త వీరులు వీరే???

    By Sindhu
    |

    2009 సంవత్సరానికి గానూ చెత్త అవార్డులను ఎవరికి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఓ సర్వే నిర్వహించగా వచ్చిన ఫలితాలివి.

    చెత్త నటుడు: నితిన్: ద్రోణ, అడవి, రెచ్చిపో, చిత్రాలలో నటించి ప్రేక్షకుల సహనాన్ని తన నటనతో పరీక్షించిన నితిన్ కు ఈ ఏడాదికి గానూ ఈ అవార్డు లభించింది. ఆయా చిత్రాలకు అత్తెసరుగానైనా కలెక్షనులు వచ్చాయంటే అది ఆ చిత్రాలలోని హీరోయిన్ల గ్లామర్ తప్ప మరోకటి కాదని నిర్వివాదాంశం. ఈ చిత్రాలలో తన ప్రభావాన్ని ఏ మాత్రం నితిన్ చూపలేకపోయాడు.

    చెత్త నటి: నయనతార: కెరీర్ ప్రారంభంలో తన అందం, అభినయాలతో ఆకట్టుకున్న నయనతార ఈ ఏటి చెత్త హీరోయిన్. జీరోసైజ్ అందాలకు తను కూడా మినహాయింపు కాదని ఆ వైపుగా ఆలోచించి తన వదనంలోని కళను చేతులారా చెడగొట్టుకున్న ఈ మలబారు భామ 'ఆంజనేయులు" చిత్రంలో కేవలం తన డీగ్లామర్ తో ఈ చిత్ర పరాజయానికి చాలా వరకు కారణభూతమైంది. అంతే కాకుండా ఈ చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాతను పలువిధాలుగా ఇబ్బందులకు గురిచేసిందని టాక్.

    చెత్త దర్శకుడు: వై.వి.ఎస్.చౌదరి: స్లో పాయిజన్ లా తన చిత్రాలను ప్రేక్షకులకు ఎక్కించే నైపుణ్యం వై.విఎస్ చౌదరి సొంతం. అయితే గత సంవత్సరం ఎన్నో అంచనాల మధ్య వచ్చిన 'ఒక్క మగాడు" ఏ విధంగా రివర్స్ చేసి ఈ ఏడాదికి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిపిందో అదేవిధంగా ఈ ఏడాది'సలీం" కూడా అదే ఖాతాలో చేరి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ 2009 గా నిలిచింది. హీరోయిన్ పై చూపిన శ్రధ్దలో కనీసం 10% చూపినా 'సలీం" ఓ మాదిరిగా 'సలాం" కొట్టించుకునేవాడని పలువురు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ ఏటి చెత్త దర్శకుడిగా చౌదరి ఈ అవార్డుకు నూటికి నూరు శాతం అర్హుడన్నది నిర్వివాదాంశం.

    చెత్త సంగీతదర్శకుడు: తమన్: ఏదో ఒక చిత్రం సక్సెస్ అయ్యిందని వరుస పెట్టి అదే తరహా మ్యూజిక్ ను అర్దం పర్ధం లేకుడా కేవలం క్రేజ్ తో నెట్టుకురావచ్చనే వారి భ్రమలకు తెరదించినట్టయింది తమన్ పరిస్థితి. అక్కీగా 'కిక్" కు అందించిన సంగీతం (సినిమా)హిట్ అయ్యేసరికి ఈ పాటలు ఎక్కేసరికి అదే తరహాలో 'శంఖం, ఆంజనేయులు, జయీభవ, మళ్ళీ మళ్ళీ, భీభత్సం" చిత్రాలకు అందించి ఖంగుతినడమే కాకుండా ఈ ఏటి చెత్త మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

    చెత్త సినిమా: సలీం: మీనింగ్ లెస్ గా తీసే సినిమాలకు పరాకాష్టలాగా ఈ చిత్రం నిలిచింది. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఈ చిత్రం ఈ ఏటి చెత్త సినిమా గా నిలిచింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X