2022 సంక్రాంతి ఫైట్: అల్లు అర్జున్ డ్రాప్.. మహేష్ బాబుకు పోటీ లేనట్లే.. ప్రిన్స్‌ను ఢీకొట్టేదెవరు?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి ఫెస్టివల్ ఎంత ప్రత్యేకమో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు అలాగే మినీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ సీజన్స్ ల్ పోటీ పడుతూ ఉండడం సహజమే. ఇక 2022 సంక్రాంతి ఫైట్ ఎలా ఉంటుందనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. గత సంక్రాంతికి మహేష్, అల్లు అర్జున్ ఏ రేంజ్ లో పోటీ పడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఈ సారి పోటీ నుంచి ఒకరి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ట్రాక్ లోకి వచ్చిన బాక్సాఫీస్
ఈ ఏడాది సంక్రాంతి కారణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసింది. క్రాక్ సినిమాతో పాటు రెడ్, మాస్టర్ సినిమాలకు బాగా కలిసొచ్చింది. ఈ మూడు సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అంధించాయి. అసలు జనాలు థియేటర్స్ వరకు వస్తారా? రారా? అను ఎన్నో అనుమానాలు వస్తున్న తరుణంలో సంక్రాంతి ఎఫెక్ట్ వల్ల సినిమాలకు కలెక్షన్స్ భారీగానే వచ్చాయి.

2020 సంక్రాంతి ఫైట్ లో..
గత ఏడాది సంక్రాంతికి ముందుగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మహేష్ కు మరో రికార్డును అందించింది. ఇక ఆ తరువాత రోజే అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో భారీ హైప్ తో విడుదలైన విషయం తెలిసిందే.

పవర్ఫుల్ కాంబినేషన్స్..
ఓ వైపు మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబో మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో.. ఈ బలమైన కాంబినేషన్స్ మధ్య పోటీ ఏ రేంజ్ లో జరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ అయితే కెరీర్ లో మొదటి సారి నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్లాస్ట్ చేసి ఏకంగా 200కోట్ల మార్క్ ను అందుకున్నారు.

2022 సంక్రాంతి ఫైట్ లేనట్లే..
అయితే 2022 సంక్రాంతికి కూడా ఆ ఫైట్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఫైట్ నుంచి అల్లు అర్జున్ తప్పుకునేలా ఉన్నారని తెలుస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చే సంక్రాంతికి రానున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ కొరటాల శివ సినిమా కూడా సంక్రాంతికి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు.

బన్నీ సమ్మర్ టార్గెట్..
ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న కొరటాల ఆ సినిమాని మే లోనే రిలీజ్ కు సిద్ధం చేసి అల్లు అర్జున్ తో మూవీ స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ టైమ్ సరిపోవడం లేదట. పుష్ప సినిమా ఆగస్ట్ లో రావాలి కాబట్టి బన్నీ ఆ సినిమా రిలీజ్ వరకు దొరకడు. ఇక ఆగస్ట్ ఏండింగ్ లో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తే 7 నెలల సమయం పడుతుండడం వలన సంక్రాంతికి రావడం కష్టమట. అందుకే సమ్మర్ లో రావాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











