For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR: పవన్ కళ్యాణ్, మహేశ్‌లతో పోటీకి సిద్ధమే.. జక్కన్నలో ఆందోళన.. హీరోల మొండిపట్టు!

  |

  టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా RRR. దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా చరిత్రలోనే మొదటిసారి ఒక అగ్ర హీరోలతో చేస్తున్న విజువల్ వండర్ పై అంచనాలు మామూలుగా లేవు. అయితే అభిమానుల ఓపికను మరోసారి పరిక్షిస్తున్నట్లు టాక్ వస్తోంది. సినిమా విడుదల విషయంలో ఇటీవల జక్కన్న తీసుకున్న నిర్ణయంపై హీరోలిద్దరు కూడా అసంతృప్తి వ్యక్తి చేసి మరో డేట్ గురించి మాట్లాడినట్లు సమాచారం.

  Allu Arjun Pushpa Breaks RRR Record, Hail Allu Arjun || Filmibeat Telugu

  ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

   200% సక్సెస్ అవుతుందని

  200% సక్సెస్ అవుతుందని

  ఇండియన్ సినిమా వరల్డ్ లో టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్లడానికి జక్కన్న చేస్తున్న RRR ప్రయోగం 200% సక్సెస్ అవుతుందని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. సినిమాకు సంబంధించిన టీజర్స్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో సరికొత్త కిక్కివ్వబోతున్నట్లు చెప్పవచ్చు.

   హై వోల్టేజ్ లుక్స్ తో

  హై వోల్టేజ్ లుక్స్ తో

  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో హై వోల్టేజ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యింది. నిర్మాతకు ప్రాఫిట్స్ చాలానే వచ్చినట్లు తెలుస్తోంది.

  టెన్షన్ లేకుండా మరింత ఆలస్యం

  టెన్షన్ లేకుండా మరింత ఆలస్యం

  అసలు మ్యాటర్ లోకి వెళితే సినిమా రిలీజ్ డేట్ పై ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే సినిమా ఏడాది పాటు వాయిదా పడింది. ఇక రాజమౌళి ఎప్పటిలానే ఆ కారణంగానే టెన్షన్ లేకుండా మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

  ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం...

  ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం...

  రాజమౌళి ఒక డేట్ అనుకున్నాడు అంటే చాలా వరకు జనాలు నమ్మడం మానేశారు. సినిమా వచ్చే వరకు కూడా నమ్మకం ఉండదని ఆయనపై కుటుంబ సభ్యులే సరదాగా కామెంట్స్ చేస్తుంటారు. ఇక RRR దసరాకు రాదని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త ఎక్కువ సమయం పట్టవచ్చని టాక్ వస్తోంది.

  మహేష్, పవన్ కళ్యాణ్ కు పోటీగా..

  మహేష్, పవన్ కళ్యాణ్ కు పోటీగా..

  ఇక దసరా మిస్సయితే మధ్యలో సంక్రాంతి వస్తోంది. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, మహేష్ సర్కారు వారి పాట రెడీగా ఉన్నాయి. సంక్రాంతికి వద్దని రాజమౌళి చెబుతున్నా కూడా ఎన్టీఆర్, చరణ్ అప్పుడైతేనే బెటర్ అని సలహాలు ఇస్తున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ సినిమాలు వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారట.

  అప్పుడైతేనే బెటర్ అని..

  అప్పుడైతేనే బెటర్ అని..

  రాజమౌళికి సమ్మర్ లో రిలీజ్ చేయాలని ఉందట. అప్పుడైతే బాలీవుడ్ కోలీవుడ్ నుంచి కూడా మరిన్ని పెద్ద సినిమాలు వస్తాయని చిత్ర యూనిట్ సలహాలు ఇస్తోందట. ఇక హరిహర వీరమల్లు లేదా సర్కారు వారి పాటలో ఎదో ఒకటి వాయిదా పడే ఛాన్స్ ఉంటుందని సంక్రాంతి అయితేనే బెటర్ అని నిర్మాత కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈ రిలీజ్ పై కన్ఫ్యూజన్ ఎప్పుడు తొలగుతుందో చూడాలి.

  English summary
  RRR is a movie that is eagerly awaited by movie lovers not only in Tollywood but across the country. Director Rajamouli's visual wonder with a top hero for the first time in the history of Indian cinema is not uncommon. It is learned that both the heroes were also unhappy with Jakkanna's recent decision to release the film and talked about another date.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X