2023 Sankranti: ఒకేసారి రాబోతున్నా ప్రభాస్, రామ్ చరణ్.. మరో బిగ్ పాన్ ఇండియా మూవీ కూడా..

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక్కసారి అటు వైపు వెళ్లిన హీరోలు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. కంటిన్యూగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెట్టాలి అని చూస్తున్నారు. వీలైనంత వరకు మంచి దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నారు కూడా. ప్రాజెక్ట్ ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా వెంటనే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది 2023 సంక్రాంతి బరిలో ఒకేసారి ముగ్గురు హీరోలు పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆదిపురుష్ డేట్ ఫిక్స్

ఆదిపురుష్ డేట్ ఫిక్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరికంటే ఎక్కువగా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా ఒకేసారి ఈ రేంజ్ లో ప్రాజెక్టులను లైన్ లో పెట్టింది లేదు. కానీ పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత అతనికి ఇండస్ట్రీ నలువైపుల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఆదిపురుష్ సినిమాను జనవరి 13వ తేదీన 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

త్రీడి టెక్నాలజీతో..

త్రీడి టెక్నాలజీతో..

ఆదిపురుష్ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో త్రీడీ ఫార్మాట్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు ఓం రౌత్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక సైఫ్ అలీ ఖాన్ రావణాసుర పాత్రలో మరోసారి తన విలనిజాన్ని చూపించనున్నాడు. ఇక సీతమ్మ పాత్రలో బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ కూడా..

రామ్ చరణ్ కూడా..

అయితే ఆదిపురుష్ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకున్న చిత్ర యూనిట్ మళ్లీ ఇప్పుడు 2023 సంక్రాంతికి తీసుకురాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఆ తేదీకి మరో రెండు సినిమాలు కూడా రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ శంకర్ కలయికలో వస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్టు కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది.

డిఫరెంట్ షేడ్స్..

డిఫరెంట్ షేడ్స్..

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC 15 డిఫరెంట్ పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఖద్దర్ వేసుకుని పవర్ఫుల్ పొలిటిషియన్ గా కూడా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా మరొక పాత్రలో ఐపీఎస్ ఆఫీసర్ గా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

RGV : బాహుబలి లెవల్ బెగ్గింగ్.. Ys Jagan మహాబలి | Tollywood Vs Ap Govt | Filmibeat Telugu
 పోటీలో ఎన్టీఆర్ కూడా..

పోటీలో ఎన్టీఆర్ కూడా..

ఇక ప్రభాస్ రామ్ చరణ్ తో పాటు వచ్చే ఏడాది సంక్రాంతిని ఎన్టీఆర్ కూడా టార్గెట్ చేశాడు. ఇప్పటికే వెండితెరకు చాలా ఎక్కువ గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్ RRR సినిమాతో వచ్చే నెల సందడి చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత వీలైనంత తొందరగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక ఆ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ వీరు ముగ్గురూ అనుకున్నట్లుగానే సంక్రాంతికి వస్తారా లేక అనవసరంగా పోటీ ఎందుకు అని ఎవరో ఒకరు తగ్గుతారా అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X