2024 సమ్మర్ స్టార్ హీరోల సమరం... రామ్ చరణ్ తో పాటు మహేష్ సినిమా కూడా అప్పుడే..
టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు, తారక్ దేవర, అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాలు కంప్లేట్ చేసే పనిలో ఉన్నారు. ఇవన్ని కూడా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం. ఇక ఈ సినిమాలు అన్ని కూడా ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయి.
వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్ కాకుండా ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రంగా ఈ ,మూవీ కూడా సిద్ధం అవుతోంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్న మరల స్క్రిప్ట్ మారడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ సమ్మర్ కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

గుంటూరు కారంతో పాటుగా ఎన్టీఆర్ దేవర సినిమా కూడా వచ్చే ఏడాది సమ్మర్ లోనే రిలీజ్ కానుంది. ఇక శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరజేక్కుతోన్న గేమ్ చేంజర్ మూవీ కూడా సమ్మర్ కానుకగా అందించే ప్రయత్నం చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ కూడా సమ్మర్ టార్గెట్ గానే రానుంది.
కచ్చితంగా వీటికి సంబందించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోయినా మార్చి తర్వాత ఈ మూవీస్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటిగా ప్రేక్షకులని పలకరించే ఛాన్స్ ఉందని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట. ఈ సినిమాలు సక్సెస్ అయితే మాత్రం మన టాలీవుడ్ స్టార్స్ గ్లోబల్ ఇమేజ్ కి ఎలాంటి డోకా ఉండదని చెప్పొచ్చు.
ఏఎ మూవీస్ అన్ని కూడా వేటికవే ప్రత్యేకం. డిఫరెంట్ జోనర్స్ లో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. రామ్ చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తోన్న సినిమాలుగా దేవర, గేమ్ చేంజర్ మూవీస్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ వీటిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











