21 ఏళ్ల కిందనే.. మహేశ్ బాబు సినిమాకు బాహుబలి రేంజ్ సెట్.. ఎన్ని కోట్లో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మహేశ్ బాబుకు ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో 26 ఏళ్ల అనుభవం ఉండటం విశేషం. ఆయన నటించిన ప్రతి చిత్రం, పోషించిన ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. టాలీవుడ్ లో మహేశ్ బాబు సినిమాకు నిర్మాతలు కూడా భారీగానే ఖర్చు చేస్తుంటారు. రిచ్ లుక్, సహజత్వం చూపించేందుకు ప్రత్యేకమైన సెట్స్, షూట్ కు అవరసమైన ఏర్పాట్లన్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో 21 ఏళ్ల కిందనే మహేశ్ బాబు సినిమాకు బాహుబలి రేంజ్లో సెట్ వేయించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మహేశ్ బాబు 1999 నుంచి హీరోగా వెండితెరపై అలరిస్తూ వస్తున్నారు. అంతకు ముందుకు చైల్డ్ ఆర్డిస్ట్ గా 1979 నుంచి 1990 వరకు పలు చిత్రాల్లో మెరిశారు. ఇక హీరోగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన చిత్రాల్లో కెరీర్ బిగినింగ్ లో అర్జున్ అనే చిత్రం కూడా ఉంది. ఈ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2004 ఆగస్టు 18న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఇప్పటికి 21 ఏళ్లు పూర్తవ్వడం విశేషం. దీంతో సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో 2 దశాబ్దాల కిందనే నిర్మించిన మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్ సెట్ అప్పట్లో సెన్సేషన్ టాపిక్.

21 Years ago A Huge Majestic Temple set for Mahesh Babu movie

అర్జున్ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. పరుచూరి బ్రదర్స్ మాటల అందించారు. క్రిష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి మహేశ్ బాబు సోదరుడు గట్టమనేని రమేశ్ బాబు నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అప్పట్లో ఈ చిత్రం కోసం ఆయన రూ.20 కోట్ల బడ్జెట్ వెచ్చించడం గొప్ప విషయం. శ్రీయా సరసన్ హీరోయిన్ నటించింది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ను అందుకుంది.

అయితే, అర్జున్ చిత్రం కోసం తొలిసారిగా హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలోని 5 ఎకరాల్లో అప్పటి వరకు అత్యంత భారీ సెట్ ను నిర్మించడం విశేషం. మదురై మీనాక్షి టెంపుల్ సెట్ ను నిర్మాత రమేశ్ బాబు రూ.4 కోట్లతో భారీ సెట్ నిర్మించారు. తమిళనాడులోని మీనాక్షి టెంపుల్ ను స్టడీ చేయడానికే ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు 15 రోజుల సమయం పట్టిందంట. ఇక ఈ టెంపుల్ ను 2.5 కోట్ల రూపాయలతో 3 నెలల్లో నిర్మించాలని అనుకుంటున్నారంట. కానీ వారి అంచనాలు దాటి పోయింది.

సెట్ పూర్తయ్యే సరికి 6 నెలల సమయం పట్టింది. రూ.4 కోట్ల ఖర్చైంది. ఈ టెంపుల్ సెట్ నిర్మాణానికి ఏకంగా 500 మంది కూలీలు పనిచేయడం విశేషం. తోట తరణి టెంపుల్ సెట్ ను నిర్మించారు. ఇందులో 130 ఫీట్ల గాలి గోపురం, 3 ఫీట్ల కొలను, 90 టన్నుల ఐరన్ తో గర్భగుడిని నిర్మించడం విశేషం. ఇక 8 గంటల పాటు పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని కూడా సెట్ లో ప్రతిష్టించడం మరో విశేషం. అలాగే ప్రకాశ్ పాత్రకు సంబంధించిన ఇంటి సెట్ ను కూడా నిర్మించాడు. సినిమాలోని మధుర మధుర, డమ్ డమరే సాంగ్స్, 40 శాతం షూటింగ్ ఇక్కడే జరగటం విశేషం.

More from Filmibeat

Read more about: mahesh babu arjun movie ssmb 29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X