'త్రి ఇడియట్స్' తెలుగు రీమేక్ లో మహేష్ ఉన్నాడా? లేడా?
మహేష్ బాబు, శంకర్ కాంబినేషన్ లో త్రీ ఇడియట్స్ చిత్రం రీమేక్ అవబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం ప్రారంభం డిసెంబర్ 6 న మొదలుకానుంది. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే హ్యారీస్ జైరాజ్ సంగీత దర్శకత్వంలో రెండు పాటలు రికార్డింగ్ పూర్తయింది. ఇక వరుడు ఫేమ్ ఆర్య, సూపర్ గుడ్ చౌదరి కుమారుడు జీవా మిగతా ఇద్దరు ఈడియట్స్ రోల్స్ కి లైన్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానాని ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈచిత్రం తెలుగు వెర్షన్ లో అల్లరి నరేష్ హీరోగా చేస్తున్నాడని, దానికి త్రీ రాస్కెల్స్ అనే టైటిల్ పెట్టనున్నాడని కూడా వినపడిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క మహేష్ ఈ చిత్రం చేయటం లేదని, అదంతా రూమర్ అని కూడా ప్రచారం జరిగింది.


Click it and Unblock the Notifications











