ప్రదీప్ సినిమాకు భారీ డిమాండ్.. లైన్ లోకి మెగా ప్రొడ్యూసర్! అందుకేనా ఈ ప్రయత్నం?
బుల్లితెర పాపులర్ యాంకర్ ప్రదీప్ సినీ హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అంటూ సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాతో ప్రదీప్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈ సినిమా హక్కుల విషయమై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బడా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రంగంలోకి దిగాయి.
ఇప్పటికే ఈ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాకు సంబంధించి వచ్చిన అప్‌డేట్స్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు యాంకర్ ప్రదీప్ పాపులారిటీ సినిమాకు బాగా ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మినిమం సక్సెస్ అయినా కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందనే టాక్ వచ్చేసింది.

దీంతో ఈ సినిమా హక్కుల విషయంలో అల్లు అరవింద్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపారట. రషెష్ చూసిన వెంటనే అల్లు అరవింద్ ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కొనుగోలు చేసేశారట. నిర్మాతలు పెట్టిన మొత్తానికి డబుల్ పెట్టి మరీ ఈ సినిమాను కొనుగోలు చేశారని, ఈ డీల్ పట్ల నిర్మాతలు హాప్పీగా ఫీల్ అవుతున్నారని ఇన్‌సైడ్ టాక్.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించాడు. చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు. మర్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











