70 ఏళ్ల హీరో ప్రేమలో 31 ఏళ్ల హీరోయిన్? .. దానికి వయసుతో పని లేదంటూ షాకింగ్ పోస్ట్

గ్లామర్ ఫీల్డ్‌ అయిన చిత్ర పరిశ్రమలో నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోకి పుకారు రాయుళ్లు చొరబడి ఉన్నది లేనిది రాసేస్తుంటారు. ఎవరైనా హీరో హీరోయిన్లు కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు వారి మధ్య ఎఫైర్లు, బ్రేకప్స్, పెళ్లిళ్లతో వార్తలన్నీ నింపేస్తుంటారు. సాధారణంగా పెద్దలు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అబ్బాయికి , అమ్మాయికి వయసు తేడా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఏకంగా తమ వయసులో సగం వయసున్న అమ్మాయిలను / అబ్బాయిలను పెళ్లి చేసుకున్న నటీనటుల గురించి మనం ఎన్నోసార్లు వార్తాపత్రికల్లో చదివాం.

ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా కొందరు సినీ నటులు మాత్రం ఏజ్‌తో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. కొంచెం వెనక్కి వెళితే బాలీవుడ్‌లో ఎంతో వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ కొందరు నటీనటులు వివాహ బంధంతో ఒక్కటై హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు , మోడల్ మిలిండ్ సోమన్ అయితే ఏకంగా తన కంటే వయసులో పాతికేళ్ల చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో హ్యాపీగా కాపురం కూడా చేసేస్తున్న సంగతి తెలిసిందే.

31 year old actress Shivangi verma in love with 70 year old senior hero

ఈ క్రమంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శివంగి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే నాచ్ బలియే సీజన్ 6 ఫైనలిస్టు‌గా చేరి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. మోడల్‌గా టాప్ బ్రాండ్లకు ప్రచారకర్తగా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శివంగి వర్మ.. బుల్లితెరపై క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శివంగి వర్మ తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను తన సినిమాల సంగతులను పంచుకుంటూ ఉంటారు. హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది శివంగి.

ఈ నేపథ్యంలో ఈ ముద్దగుమ్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ 70 ఏళ్ల నటుడితో క్లోజ్‌గా ఉన్న ఫోటోను షేర్ చేసి కలకలం రేపింది. 31 ఏళ్ల శివంగి.. సీనియర్ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది. అక్కడితో ఆగితే ఏం జరిగితే కాదు.. కానీ ప్రేమకు వయసు పరిమితులు లేవు అంటూ కొటేషన్ పెట్టడంతో అందరికీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. కొంపదీసి శివంగి అతనితో ప్రేమలో పడిందా? ప్రేమలో పడొచ్చు కానీ మరీ ఈ మాదిరిగానా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే శివంగి, గోవింద్ నామ్‌దేవ్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని.. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్‌లో ఆయనతో కలిసిఉన్న ఫోటోలను శివంగి షేర్ చేసి ఉండొచ్చని కొందరు ఆమెకు మద్ధతుగానూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్నా శివంగి, గోవింద్ నామ్ దేవ్‌లు ఇంత వరకు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ఇకపోతే.. గోవింద్ హిందీ ఇండస్ట్రీలో విలన్‌గా ఫేమస్. సత్య, సర్పరోష్, బ్యాండిట్ క్వీన్ వంటి సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X