మహేష్ బాబుకి పవర్ స్టార్ నుంచి కంటిన్యూ కాల్స్?
ప్రిన్స్ మహేష్ బాబుకి ఒక్క రోజులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ముప్పై ఆరు కాల్స్ వచ్చాయని ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం...కొమురం పులి డిజాస్టర్ కావటంతో తన ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ పరిస్ధితిని కొంతైనా మెరుగు పరచాలనే ఉద్దేశ్యంతో మహేష్ కి ఈ కాల్ చేసాడని చెప్తున్నారు.ఎందుకంటే పులికి,ఖలేజాకి ఒకే నిర్మాత కావటం వల్లన అని చెప్తున్నారు. అలాగే ఖలేజా ఏమైనా వర్కవుట్ అయితే కొంతలో కొంత నిర్మాత శింగనమల రమేష్...పులి ఎఫెక్టు నుంచి బయిటపడే అవకాశం ఉందని అందుకే ఈ కాల్స్ చేసాడని చెప్పుకుంటున్నారు. ఇక ఖలేజా స్టేటస్ ఏమిటని పర్శనల్ గా త్రివిక్రమ్ ని కూడా పవన్ కళ్యాణ్ ఫోన్ లో ఎంక్వైరీ చేసాడని, ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా సినిమా గురించి అడగని పవన్ అలా అడిగేసరికి త్రివిక్రమ్, మహేష్ లు షాక్ అయ్యారుట. ఇక పవన్ ఫోన్ చేసిన సమయంలో మహేష్ వేరే బిజీలో ఉండి ఫోన్ లిప్ట్ చేయకపోవటంతో అన్ని మిస్సెడ్ కాల్స్ నమోదు అయ్యోయని అది చూసే పవన్ ఎంత డెస్పరేట్ గా ఉన్నాడనే విషయం అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఇదంతా రూమర్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇక ఖలేజా చిత్రం ఈ నెల 30 వ తేదీన రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











