సామ్-చై విడిపోవడానికి ఆ ఐదే కారణాలే? నెటిజన్లు చెప్పిన షాకింగ్ కారణాలు ఏంటంటే?

చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ విడిపోయారు. నాలుగేళ్ల వివాహ బంధంతో కలుపుకుంటే ఏకంగా 17 స్నేహబంధం వారిది. మరి కొద్ది రోజుల్లో ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన సమంత నాగ చైతన్య ఇక తాము కలిసి ఉండలేనంటూ ఒకే సమయంలో ప్రకటనలు చేశారు. అయితే వారు విడిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్న వాళ్ళు ఆ విషయాలను మాత్రం బయటపెట్టలేదు. ఇక నాగార్జున సైతం అది వారి వ్యక్తిగతం అని ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరారు. అయితే వారిద్దరు విడిపోవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఎవరూ ఊహించని విధంగా

ఎవరూ ఊహించని విధంగా

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్ నాగచైతన్య-సమంతల విడాకులు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిందన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయినప్పటికీ అభిమానులు అయితే అంతగా నమ్మలేదనే చెప్పాలి. పనీ పాటా లేక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే అనేక వందల రూమర్స్ లో బోలెడన్ని వదంతుల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోతుందని వారు భావించారు.

కానీ ఆ పుకార్లనే నిజం​ చేస్తూ తాము విడాకులు తీసుకున్నట్లు చైతన్య సమంత శనివారం నాడు వెల్లడించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విడిపోవడం అటు అక్కినేని అభిమానులకు, ఇటు సామ్‌ ఫ్యాన్స్‌కి మింగుడుపడటం లేదనే చెప్పాలి.

చివరిగా అప్పుడే

చివరిగా అప్పుడే

నిజానికి సమంత, నాగచైతన్య చివరగా 'ఆహా'లో ప్రసారమైన 'సామ్‌ జామ్‌'లో కలిస్సి సందడి చేశారు. ఈ రియాలిటీ టాక్‌ షోలో చివరి గెస్ట్ గా చైతన్యనే పాల్గొనడం విశేషం కాగా ఆ తర్వాత వీరిద్దరు క్లోజ్‌గా మూవ్‌ అయిన సందర్భాలు, బయటకు కనిపించిన దాఖలాలు చాలా తక్కువ. రెండు నెలల క్రితం నాగచైతన్య హిందీ సినిమా 'లాల్‌ సింగ్‌ చద్దా' షూటింగ్‌లో పాల్గొనేందుకు లఢక్ వెళ్లినప్పుడు కూడా ఆయనకు బెస్ట్ విషెస్‌ తెలిపింది సమంత.

ఆ తర్వాత ఏమయిందో ఏమో తన ట్విట్టర్‌, ఇన్‌స్టా గ్రామ్‌లో అక్కినేని అనే పేరుని తీసేసింది. కానీ ఆమె ప్రస్తుతం 'శాకుంతలం' చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆ సినిమా కోసం అలా మార్చుకున్నారని ఆమె పీఆర్ టీమ్ కవర్ చేసింది కానీ అప్పుడే చైతూతో సమంతకు చెడిందనే రూమర్స్ వెల్లువెత్తాయి.

మూడు కోట్ల డైమెండ్ నెక్లెస్

మూడు కోట్ల డైమెండ్ నెక్లెస్

ఇక సోషల్‌ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఈ జంట విడిపోవడానికి ఇదే కారణమంటూ తమకు ఇష్టమొచ్చిచ్చినట్లుగా విశ్లేషణ చేస్తున్నారు. అయితే ముందుగా పెళ్ళైన మొదటి రోజే సమంత అప్సెట్ అయిందని అంటున్నారు. ఆరోజు ఆమెకు మూడు కోట్ల విలువైన ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ రాగా అది సమంత దాకా ఇప్పటికి కూడా చేరలేదని అంటున్నారు.

అయితే అది ఎవరు అందడనివ్వలేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ తరువాత సమంత ఫస్ట్ టైమ్ వెబ్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్‌ 2లో నటించారు. ఆ వెబ్‌ సిరీస్‌కి ఆమెకు సౌత్‌లోనే కాకా నార్త్ లో కూడా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇందులో ఒక ఘాటు, బోల్డ్ రోల్‌ చేసింది సమంత. ఇంటిమేట్‌ సీన్లలోనూ సమంత యాక్ట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. సమంత, చైతూల మధ్య గ్యాప్ కి ఇదొక కారణమని నెటిజన్లు భావిస్తున్నారు.

పిల్లలు కావాలని కోరడం కూడా?

పిల్లలు కావాలని కోరడం కూడా?

పెళ్లయి నాలుగేళ్లు అవుతున్న కారణంగా నాగచైతన్య పిల్లలు కావాలని కోరగా సమంత అందుకు ఒప్పుకోలేదు అని అదే సమయంలో ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ కొత్త వెబ్ సిరీస్ లు ఒప్పుకుంటూ ఏకంగా ముంబై మకాం మార్చడానికి కూడా ప్రయత్నాలు చేసింది అనేది మరో వాదన. ఇద్దరూ టాలీవుడ్ లో ఉంటే సాయంత్రానికి ఒకరి ముఖం ఒకరు చూసుకోవచ్చు, ఒకరు ముంబై వెళ్లి ఒక హైదరాబాద్ లో ఉంటే పెళ్లి చేసుకున్నాక కూడా దానికి ఒక సార్ధకత ఏమిటి అనేది ఈ నాగచైతన్య వాదన గా చెబుతున్నారు.

Recommended Video

Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
ఆ సిరీస్ లతో పాటు అతను కూడా?

ఆ సిరీస్ లతో పాటు అతను కూడా?

ఇక ఆమె వెబ్ సిరీస్ లో నటించడమే కాక సూపర్ డీలక్స్ లాటి ఘాటు సినిమాల్లో నటించడం అనేది నాగచైతన్య తో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా నచ్చలేదని నిజానికి గతంలో ఆమె కొన్ని హాట్ ఫోటోలు సోషల్ మీడియా షేర్ చేస్తున్నప్పుడే ఇది పద్ధతి కాదు అని అక్కినేని కుటుంబం నుంచి సున్నితంగా కొన్ని వార్నింగులు వెళ్లాయి అని అంటున్నారు.

అయితే సమంత మాత్రం వాటిని పెద్దగా పట్టించుకునేది కాదు అని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ప్రీతం జవాల్కర్ అనే ఒక సెలబ్రిటీ స్టైలిస్ట్ పుట్టిన రోజు సందర్భంగా సమంత అతని ఒడిలో కాళ్లు పెట్టుకున్న కొన్ని ఫోటోలు షేర్ చేయడంతో అప్పుడు అక్కినేని అభిమానులు సహా టాలీవుడ్ ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. అతను కూడా సమంత నాగచైతన్య బంధం తెగిపోవడానికి ఒక కారణం అనే విశ్లేషణలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అయితే ఎవరెన్ని విశ్లేషణలు చేసిమా అసలు ఎందుకు విడిపోయారు అనేది సమంత నాగచైతన్యల మనసులకే తెలుసు. వారు బయట పెట్టనంత వరకు ఇవన్నీ పుకార్లు గానే భావించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X