50 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్ళికి రెడీ అవుతున్న సూపర్ స్టార్

మన దేశంలో సినీ పరిశ్రమకి సంబంధించి ఉన్న ప్రముఖుల పర్శనల్ లైఫ్ లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పాలి. కొందరు అయితే సినిమాలోనే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు పెళ్లి చేసుకొని విడిపోయిన వారు కూడా లేకపోలేరు. అయితే కొందరు జంటలు యూత్ లో మంచి ఆదర్శంగా ఉన్నవారు కూడా లేకపోలేదు. ఈ సైకిల్ ఇండియన్ సినిమా దగ్గర బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో కొనసాగుతూనే ఉంటుంది.

అయితే మరికొందరు విషయాల్లో పెళ్లి, ప్రేమ మేటర్ లు మంచి ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. అలా ఇప్పుడు బాలీవుడ్ సినిమా దగ్గర బిగ్ స్టార్స్ లో ఒకడైన హృతిక్ రోషన్ పై ఇంట్రెస్టింగ్ వార్తలు ఇపుడు వైరల్ గా మారాయి. కాగా హృతిక్ రోషన్ కి ఎప్పుడో 2000 లో పెళ్లి అయినప్పటికీ తర్వాత తన భార్య నుంచి విడిపోవడంతో మధ్యలో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం ఇంకా కొన్ని అఫైర్స్ ఉన్న ఉన్నాయని బాలీవుడ్ లో ఉన్న మాటే.

50 years star hero hrithik roshan now ready for his love marriage

కాగా మన తెలుగు సినిమా ఆడియెన్స్ కి కూడా బాగా పరిచయం అయిన ఈ 50 ఏళ్ల గ్రీక్ గాడ్ ఇప్పుడు పెళ్ళికి సిద్ధం కాబోతున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం హృతిక్ రోషన్ కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటి సబా ఆజాద్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఇద్దరూ కూడా బయట కలిసి కనిపించడం కూడా జరగడంతో సీక్రెట్ రిలేషన్ షిప్ ఏమీ కాదని అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంది.

కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారా అనే ప్రశ్న మొదలైంది. కాగా ఇందుకు సబా ఆజాద్ పెట్టిన పెట్టిన పోస్ట్ చర్చకు దారి తీసింది. తనది ఓ పిక్ పెట్టి "త్వరలోనే చెప్పబోతున్నాను" అంటూ పోస్ట్ చేయడం ఒకెత్తు అయితే దీనికి హృతిక్ రోషన్ రిప్లై ఇస్తూ నేను కూడా అంటూ లవ్ సింబల్ పెట్టడంతో ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ మొదలయ్యింది. దీనితో ఆమె పోస్ట్ లో ఇద్దరికీ ఆల్రెడీ ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేస్తున్నారు.

50 years star hero hrithik roshan now ready for his love marriage

మరి వీరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా లేక ఇదేమన్నా ప్రమోషన్ స్టంటా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ ఇద్దరూ డేటింగ్ లోనే ఉన్నారు దీనిని పెళ్లి వరకు తీసుకెళ్లి క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. కాగా ఇప్పుడు హృతిక్ రోషన్ భారీ సినిమాలు చేస్తుండగా వీటిలో మన తెలుగు హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెన్సేషనల్ యాక్షన్ సీక్వెల్ చిత్రం "వార్ 2" చేస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుంది. దీనిపై సౌత్ నుంచి నార్త్ వరకు భారీ అంచనాలు నెలకొనగా ఈ చిత్రంని బాలీవుడ్ విజువల్ వండర్ "బ్రహ్మాస్త్ర" దర్శకుడు అయాన్ ముఖేర్జీ తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాతోనే తారక్ కూడా బాలీవుడ్ మార్కెట్ లోకి డైరెక్ట్ అడుగు పెట్టబోతున్నాడు.

More from Filmibeat

Read more about: hrithik roshan saba azad jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X