ప్రభాస్ కు పెళ్లి.. 45 ఏళ్లలో ఎన్ని వేల సంబంధాలు వచ్చాయో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తున్నారో మనకి తెలిసిందే. చివరిగా 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆ రెండు చిత్రాలు కూడా ఫ్యాన్స్ తో మెప్పించడమే కాకుండా ఫుల్ మీల్స్ అందించాయి. ప్రేక్షకుల నుంచి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. సలార్ ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి మరో వెయ్యి కోట్ల సినిమాగా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డుల్లోకి ఎక్కింది.
ఇక నెక్ట్స్ కూడా ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డార్లింగ్ కూడా త్వరలో రాబోతున్న సినిమాలపై ప్రత్యక శ్రద్ధ వహించారు. ఇప్పటికే ఒక్కొక్క చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు నెక్ట్స్ రిలీజ్ కు రెడీ కాబోతున్నాయి. ఆ తర్వాత మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ప్రభాస్ లైనప్ లో ఉండటం విశేషం. ఇలా ప్రభాస్ కు మూడేళ్లపాటు ఖాళీ లేకుండా సినిమాల షెడ్యూల్ ఫిక్స్ అయ్యి ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ పెళ్లిపై అసలు ఊసే ఎత్తడం లేదు. ఆయన ఓ ఇంటివాడైతే చూడాలని తన డైహార్ట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అప్పుడంటూ కాలం వెల్లదీస్తున్నారే గానీ తన అభిమానులకు మాత్రం తీపి కబురు చెప్పడం లేదు. 1979 అక్టోబర్ 23న జన్మించిన ప్రభాస్ ఇప్పటికే 45 ఏళ్ల వయస్సును దాటేశారు. అయినా పెళ్లిపై ఆసక్తి చూపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. గతంలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు వచ్చినా అది వాస్తవం కాదని తేల్చారు. తాము ఫ్రెండ్స్ అంటూ ప్రెస్ మీట్లలో వెల్లడించారు.
అయితే, ప్రభాస్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా కీర్తి పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి, బాహుబలి 2 కంప్లీట్ చేశాక ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని అంతా ఆశగా ఎదురుచూశారు. కానీ డార్లింగ్ ఎలాంటి స్వీట్ చెప్పలేదు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కు వేల్లల్లో పెళ్లి సంబంధాలు వచ్చాయంట.ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వెళ్లడంతో ఏకంగా డార్లింగ్ తో పెళ్లికి సిద్ధమంటూ 5000 మంది మ్యారేజ్ ప్రపోజల్స్ పంపించారంట.
ఇందులో వాస్తవం ఎతుందనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతోంది. ఏదేమైనా 5 వేల వరకు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా డార్లింగ్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ఓ రహస్యంగా మారింది. అయితే ప్రభాస్ నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హాజరైన సందర్భంలో తన పెళ్లిపై స్పందించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా బదులిచ్చారు. ఇక అటు డార్లింగ్ తల్లి శివ కుమారి, పిన్ని శ్యామలాదేవి కూడా పలుమార్లు స్పందించినా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ప్రభాస్ మాత్రం తను కెరీర్ లో పెట్టుకున్న టార్గెట్స్ కారణంగానే రిజెక్ట్ చేస్తూ వస్తున్నారని టాక్. ఇక డార్లింగ్ 'స్పిరిట్', 'కల్కి2', 'సలార్2' వంటి చిత్రాల్లోనూ నటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











