twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొందరపాటు నిర్ణయం: అల్లు అర్జున్ సినిమాకు రూ. 6 కోట్ల నష్టం!

    By Bojja Kumar
    |

    అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య'. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే చిత్ర నిర్మాతలు తీసుకున్న ఓ తొందరపాటు నిర్ణయం మూలంగా రూ. 6 కోట్ల నష్టం వాటిల్లిందట. దీంతో ఏమీ చేయలేక చేతులు పిసుక్కుంటున్న వైనం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

     నా పేరు సూర్య

    నా పేరు సూర్య

    అల్లు అర్జున్‌కు కేవలం తెలుగునాట మాత్రమే కాదు.... కేరళ, కర్నాటకలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక హిందీలో బన్నీ డబ్బింగ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. థియేట్రికల్ రైట్స్ కాకుండా హిందీ టీవీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్‌ ద్వారా బన్నీ సినిమాలకు సగం పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.

     రూ. 12 కోట్లకు కొనుగోలు... 18 కోట్ల ఆఫర్

    రూ. 12 కోట్లకు కొనుగోలు... 18 కోట్ల ఆఫర్

    బన్నీ సినిమాకు మంచి డిమాండ్ ఉండటంతో.... ‘ఫస్ట్ ఇంపాక్ట్' విడుదల కాకముందే ఓ సంస్థ ‘నా పేరు సూర్య' డిజిటల్ రైట్స్ రూ. 12 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ విషయం తెలియని మరో సంస్థ ‘ఫస్ట్ ఇంపాక్ట్' చూసి ఫిదా అయిపోయి రూ. 18 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందట.

    రూ. 6 కోట్ల నష్టం

    రూ. 6 కోట్ల నష్టం

    అయితే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ముందే అమ్మేయడం, అగ్రిమెంటు కూడా పూర్తవ్వడంతో రూ. 18 కోట్ల ఆఫర్ వచ్చినా తీసుకోలేని పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారు. తొందరపడి రూ. 6 కోట్లు నష్టపోయామే... అంటూ చేతులు పిసుసక్కుంటున్నారట.

     బిజినెస్ విషయంలో తొందరపాటు వద్దు

    బిజినెస్ విషయంలో తొందరపాటు వద్దు

    అయితే ఇకపై ఇలాంటి తప్పు చేయవద్దని, థియేట్రికల్ రైట్స్ బిజినెస్ విషయంలో ఆచితూచి ముందుకు వెళ్లాలని, సాధ్యమైనంత ఎక్కువగా, వీలైతే రికార్డు స్థాయిలో థియేట్రికల్ రైట్స్ అమ్మాలని చిత్ర నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

     ప్రేమికుల రోజు కానుక

    ప్రేమికుల రోజు కానుక

    కాగా... ఫిబ్రవరి 14న ‘నా పేరు సూర్య' సినిమాలోని రెండో పాట ‘లవర్ ఆల్సో ... ఫైటర్ ఆల్సో' ను విడుదల చేస్తున్నట్లు అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, విశాల్ శేఖర్ సంగీతమందించారు.

     రెస్పాన్స్ బావుంది

    రెస్పాన్స్ బావుంది

    ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్, గణతంత్ర దినోత్సవం సందర్బంగా మొదటి పాటను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.

     బన్నీ కెరీర్లో స్పెషల్ మూవీ

    బన్నీ కెరీర్లో స్పెషల్ మూవీ

    ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపించబోతున్న బన్నీ గతంలో ఏ సినిమాకు చేయనంతగా హార్డ్ వర్క్ చేశాడు. బన్నీ కెరీర్లోనే ఈ చిత్రం ఓ స్పెషల్ మూవీగా కాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు చూడని మిలటరీ ట్రైనింగ్ బ్యాక్‌డ్రాపుతో ఈ చిత్రం రాబోతోంది.

     తెరవెనక

    తెరవెనక

    ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యేయేల్ హీయిన్. ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి, సంగీతం - విశాల్ - శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు, బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, సమర్పణ - k.నాగబాబు, సహ నిర్మాత - బన్నీ వాసు, నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ.

    English summary
    Allu Arjun’s Naa Peru Surya digital rights were sold for Rs 12 crores, much before the film’s first impact was released. Watch the video to know how producers incur 6 Cr loss with this deal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X