Chiranjeevi: 8 మంది హీరోయిన్లతో చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ.. టైటిల్ ఫిక్స్?

స్వయంకృషితో ఎదగడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పే హీరో చిరంజీవి. చిన్న పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మెగాస్టార్ గా, బాస్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల వరుస పెట్టి సినిమాలతో తెగ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం యువ దర్శకులతో సినిమాలను లైన్లో పెట్టారు. అయితే ఈ మధ్య రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమాతో రాబోతున్నట్లు టాక్ వస్తుంది. అది కూడా యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో 8 మంది హీరోయిన్లతో చిరు రొమాన్స్ చేయున్నాడని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో ఎక్కువగా రీమేక్ చిత్రాలే ఉంటున్నాయి. ఇప్పటికే లూసీఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ మూవీతో మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ అజిత్ వేదాళం చిత్రానికి భోళా శంకర్ రీమేక్ అని కన్ఫర్మ్ అయింది. ఇందులో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్, జోడీగా తమన్నా నటించనన్నారు. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు.

8 Heroines In Chiranjeevi Vasishta Socio Fantasy Movie And Titled As Mulloka Veerudu

ఇటీవలే ఈ సినిమా నుంచి చిరు లీక్స్ పేరుతో సెట్ వీడియోను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాకుండా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మలయాళం హిట్ మూవీ బ్రో డాడీని రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో చిరంజీవితోపాటు డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా నటించనున్నాడని టాక్. ఇందులో చిరు, సిద్ధూ తండ్రీకొడుకులుగా అలరించున్నారని సమాచారం. ఇక దీనికి మంచి మరో అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి మరో యువదర్శకుడితో సినిమా చేయనున్నట్లు టాక్. అతను ఎవరో కాదు నందమూరి కల్యాణ్ రామ్ కు బింబిసార వంటి సూపర్ హిట్ ఇచ్చిన వశిష్ట. చిరంజీవి హీరోగా ఇదివరకు జగదేకవీరుడు అతిలోక సుందరి, యముడికి మొగడు వంటి సోషియో ఫాంటసీ సినిమాలు చేశారు. అవి ఎంత హిట్ అయ్యాయో కూడా తెలుసు. ఇప్పుడు మళ్లీ అదే జోనర్ లో చిరు మూవీ ఉండనుందట. వశిష్ట చెప్పిన సోషియో ఫాంటసీ లైన్ మెగాస్టార్ కి నచ్చిందని టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో 8 మంది హీరోయిన్స్ నటించునున్నారట. వారితోపాటు పులవురు కొత్త నటీనటులను తీసుకుంటారట. ఇక ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరించనున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X