'ఎన్టీఆర్' బయోపిక్ సంచలనాలు మొదలు.. బాక్సాఫీస్ దద్దరిల్లేలా ఆఫర్, నో చెప్పిన బాలయ్య!
Recommended Video

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం సంచలనాలు మొదలు పెట్టింది. కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత చరిత్ర వెండి తెరపై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు తేజ ఈచిత్రం నుంచి తప్పుకున్న తరువాత క్రిష్ ఆ బాధ్యతలని చేపట్టారు. బాల కృష్ణ ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు స్టార్ నటీ నటుల్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు. చిత్రీకరణ ప్రారంభమైన కొద్ది రోజులు మాత్రమే అవుతోంది. అప్పుడే ఈ చిత్రానికి కళ్ళు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయి.

సర్వత్రా ఉత్కంఠ
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై అందరిలో ఉత్కంఠ నెలకొని ఉండడం సహజం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. స్వయంగా బాలయ్యే ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండడంతో ఇంకా క్రేజ్ పెరిగింది.

కళ్ళు చెదిరే ఆఫర్
కొద్దిరోజుల క్రితమే చిత్రీకరణ ప్రారంభమైన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి ట్రేడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెట్టారు. ప్రముఖ సంస్థ సోని పిక్చర్స్ బాలయ్య ముందు కళ్ళు చెదిరే ఆఫర్ ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

80 కోట్లు
సోని సంస్థ ఎన్టీఆర్ బయోపిక్ హక్కుల కోసం 80 కోట్ల డీల్ బాలయ్య ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ ప్రకటం తెలుగు, తమిళ, హిందీ హక్కులని వారికీ ఇవ్వవలసి ఉంటుంది. కానీ బాలయ్య ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

విద్యాబాలన్
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. సోని సంస్థ ఇంత భారీ మొత్తంలో ఆఫర్ చేయడానికి ఇది కూడా కారణం కావచ్చు. బాలీవుడ్ లో విద్యాబాలన్ కు ఉన్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగు అభిమానుల్లో రోజు రోజుకు ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

కీలక పాత్రలు
కేవలం ఒక్క విద్యాబాలన్ మాత్రమే కాదు.. ఎన్టీఆర్ సినీరాజకీయ జీవితంలో కీలక పాత్ర వహించిన ప్రతిఒక్కరి రోల్ కోసం బాలయ్య స్టార్ నటీనటుల్ని తీసుకోబోతున్నాడు. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ దృష్ట్యా 80 కోట్ల డీల్ కాస్త 100 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











