Divorce: స్టార్ హీరోయిన్‌తో టాప్ హీరో విడాకులు.. డైవోర్స్ బాటలో మరో స్టార్ కపుల్!

భారతదేశంలో వివాహానికి, వైవాహిక వ్యవస్ధకు ఎంతో ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు జేజేలు పలుకుతుంది. అలాంటి భారతీయ వైవాహిక వ్యవస్ధకు ప్రస్తుత కాలంలో బీటలు వారే పరిస్ధితి నెలకొంది. మనదేశంలో విడాకుల కల్చర్ నానాటికీ పెరుగుతోంది. ఒకరిని చూసి మరొకరు డైవర్స్ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచే సెలబ్రెటీలు తొందరపాటు నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కడ చూసినా విడాకుల వార్తలే కనిపిస్తున్నాయి. గతేడాది దిగ్గజ సంగీత దర్శకుడు , ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భాను నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 సంవత్సరాల వైవాహిక బంధానికి వీరిద్దరూ ముగింపు పలకడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయనే కాదు కోలీవుడ్ , బాలీవుడ్, టాలీవుడ్.. దేశంలో ఇప్పుడు ఏ వుడ్ తీసుకున్నా విడాకుల అంశం మారుమోగుతోంది. సెలబ్రెటీలు సుదీర్ఘంగా డేటింగ్ చేసి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కినంత సేపు పడటం లేదు విడాకులు తీసుకోవడానికి.

A Bollywood couple is going to get divorced soon says Umair Sandhu

సెలబ్రెటీ జంటల్లోని భార్య, లేదా భర్త .. తమ జీవిత భాగస్వామి ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేసినా వారి ఖాతాలను అన్ ఫాలో చేసినా జనానికి ఎక్కడో తేడా కొడుతోంది. గతంలో టాలీవుడ్ స్టార్ కపుల్స్ అక్కినేని నాగచైతన్య - సమంత, నిహారిక - చైతన్యల విషయంలో ఇదే జరిగింది. స్టార్ సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే విడిపోవడం కామన్ అయ్యింది. ఈ క్రమంలోనే స్టార్ కపుల్స్ సోషల్ మీడియాలో ఎలాంటి షాకింగ్ న్యూస్ చెబుతారోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు మరో బాంబు పేల్చాడు. బీటౌన్‌లోని ఓ స్టార్ కపుల్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లుగా ట్వీట్ చేశాడు. అతను చెబుతున్న జంటకు బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. సదరు హీరోకు ఆల్రెడీ పెళ్లయి మొదటి భార్య నుంచి ఎప్పుడో విడిపోయి విడాకులు కూడా తీసుకున్నాడు. అంతేకాదు.. అతనికి పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారట. కూతురు స్టార్ హీరోయిన్ కాగా.. కొడుకును త్వరలో హీరోగా అరంగేట్రం చేయించాలని ఆ సీనియర్ హీరో భావిస్తున్నాడట.

మొదటి భార్య నుంచి విడిపోయాక బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మతో ప్రేమలో పడ్డాడట ఆ ముదురు హీరో. కొన్నాళ్లు డేటింగ్ చేశాక ఇతని కోసం పీక్స్‌లో ఉన్న కెరీర్‌ను కూడా పక్కనపెట్టి ఆ హీరోను పెళ్లి చేసుకుందట. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. భర్త, పిల్లల కోసం కొన్నాళ్లు కెరీర్‌ను త్యాగం చేసిన ఈ సీనియర్ హీరోయిన్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసి హిట్ మూవీలలో నటించింది. ఈమె భర్త హిందీతో పాటు సౌత్‌లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్న టైంలో వీరిద్దరూ విడిపోతున్నట్లుగా ఉమైర్ సంధు చెప్పడం దుమారం రేపుతోంది. ఇంతకీ అతను చెప్పిన ఆ జంట ఎవరు? ఎందుకు విడాకులు తీసుకోబోతున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: bollywood umair sandhu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X