దాడి ఘటన: షారుఖ్, శిరీష్ మధ్య రాజీ
అగ్నిపథ్ సినిమా సక్సెస్ పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్....దర్శకురాలు ఫరాఖాన్ మొగుడు శిరీష్ కుందర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ గొడవను పెద్దది చేసుకోకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిరిట్లు సమాచారం. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఫరాఖాన్, శిరీష్ కుందర్ ఇటీవల షారుఖ్ ఇంటికి వెళ్లి కలిసి ఈ విషయమై చర్చించుకున్నారని, షారుఖ్ కూడా కాంప్రమైజ్ అయ్యాడని తెలుస్తోంది. ఫరాఖాన్ బ్రదర్ సాజిద్ ఖాన్ షారుఖ్ భార్య గౌరీని రిక్వెస్ట్ చేసి....షారుఖ్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించారని, ఆనంతరం ఫరాఖాన్, శిరీష్ వెళ్లి అతన్ని కలిశారని అంటున్నారు.
చాలా ఏళ్ల నుంచి షారుఖ్-ఫరాఖాన్ మంచి స్నేహితులు. 14 వేళ్ల వీళ్ల స్నేహంలో 2009లో విబేధాలు వచ్చాయి. ఫరాఖాన్ షారుక్ హీరోగా 'హాప్పీ న్యూ ఇయర్' సినిమాను ప్లాన్ చేసింది. ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించిన షారుఖ్ స్క్రిప్టులో మార్పులు చేయాల్సిందిగా ఫరాఖాన్‌ను కోరాడు. ఇది పట్టించుకోని ఫరాఖాన్ ఆ సినిమాను పక్కన పెట్టి సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి అక్షయ్ కుమార్, కత్రినా జంటగా 'తీస్ మార్ ఖాన్' చిత్రాన్ని నిర్మించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగతూ వచ్చిందట. ఈ క్రమంలో ఫరాఖాన్ భర్త శిరీష్ చేసిన పనులు షారుఖ్ కు కోపం తెప్పించాయి. ఇటీవల సంజయ్ దత్ ఇచ్చిన 'అగ్నిపథ్' సక్సెస్ పార్టీలో కోపం ఆపుకోలేక అతనిపై చేయి చేసుకున్నాడు షారుక్.


Click it and Unblock the Notifications











