అలా చేస్తే మాత్రం అల్లు అర్జున్ బయటపడతాడా..? అనుమానపడుతూ హాట్ హాట్ చర్చలు

సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్. దర్శకనిర్మాతలు సెంటిమెంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కొత్తసినిమా 'అల.. వైకుంఠపురములో' టైటిల్‌లో స్వల్ప మార్పు చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అల్లు అర్జున్ కెరీర్‌లో సరైన హిట్ పడకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు స్టైలిష్ స్టార్.

ఈ నేపథ్యంలోనే జ్యోతిష్యుల సలహా మేరకు సెంటిమెంట్‌కి పాధాన్యత ఇస్తూ 'అల.. వైకుంఠపురములో' టైటిల్‌లో స్వల్ప మార్పు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినపుడు 'అల.. వైకుంఠపురములో' ఇంగ్లీష్ టైటిల్‌లో ఒకే ఒక్క 'ఆర్' అనే అక్షరం ఉండేది. కానీ ఇటీవలే సామజవరగమన సాంగ్ రిలీజ్ సమయంలో దానికి మరో 'ఆర్' అనే అక్షరాన్ని జోడించారు మేకర్స్. దీంతో ఇలా చేస్తే మాత్రం అల్లు అర్జున్ ఫేట్ మారుతుందా? ఫలపుల నుంచి బయటపడతాడా..? అనే చర్చ జనాల్లో మొదలైంది.

A Littile Bit Change In Ala Vaikutapuramlo Title.. Its going hot topic

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X