పవన్ 'అత్తారింటికి దారేది' లీక్ డైలాగ్ (కొత్తది)

By Srikanya

హైదరాబాద్ : పవన్ కల్యాణ్, సమంత జంటగా నటిస్తున్న క్రేజీ చిత్రం 'అత్తారింటికి దారేది' . త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రణీత మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో డైలాగులు లీక్ అంటూ కొన్ని డైలాగులు సర్కులేట్ అవుతున్నాయి...అవేమిటంటే...

పవన్ కి,సమంతకి మధ్య జరిగే సంభాషణ...

పవన్ : నీతో నేనూ వస్తా

సమంత : రెండూ అంటే కుదరదు... అయితే సినిమాకి, లేదా షాపింగ్ కి,
డిసైడ్ చేస్కో ఎక్కడికి వస్తావో...

పవన్ : తిరుపతికి తీసుకు వెళ్ళి
దర్శనం కావాలా,
ప్రసాదం కావాలా ...అంటే నా లాంటి భక్తుడు యేమి
డిసైడ్ చేసుకుంటాడు చెప్పు....

ఇక ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.త్వరలో 25 రోజుల షెడ్యూల్ నిమిత్తం యూరప్ వెళ్లేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా స్పెయిన్‌లోనూ చిత్రీకరణ జరపనున్నారు.

'వన్ లైనర్' డైలాగులకూ, కామెడీకీ పెట్టింది పేరైన త్రివిక్రమ్ ఈ సినిమాలోనూ వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, ఇటీవలే 'మిర్చి'లో ప్రభాస్ తల్లిగా కనిపించిన నదియా కీలక పాత్రలు చేస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 'జల్సా' వంటి హిట్ సినిమా తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సినిమాపై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X