హరిహర వీరమల్లు.. మళ్లీ డైరెక్టర్ ఛేంజ్? రంగంలోకి అగ్ర దర్శకుడు
ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి 2 ఏళ్లకు దగ్గర కావస్తోంది. చివరిగా బ్రో చిత్రంతో థియేటర్లలో కనిపించారు. అంతకు ముందు భీమ్లా నాయక్ తో అలరించారు. అయితే 2024లో ఏపీ శాసనసభ ఎన్నికలు ఉండటం, పవన్ కళ్యాణ్ సవాల్ గా తీసుకొని ప్రభంజనం సృష్టించండం, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం ప్రజా పాలన చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇంతటి భారీ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తారా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'హరిహర వీరమల్లు' చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. ఆ వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న చిత్రాలివే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయా కార్యక్రమాలు, సమావేశాలకు హాజరవుతూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూ వచ్చారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు వరకు కూడా సినిమాలకు పనిచేశారు. ఏపీ ఎన్నికలు రావడంతో మళ్లీ అన్నింటిని హోల్డ్ లో పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ లైనప్ లో ప్రస్తుతం 3 చిత్రాలు ఉన్నాయి. అందులో హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు : పార్ట్ 1', 'దే కాల్ హిట్ ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి చిత్రాల్లో నటించాల్సి ఉంది. ఎన్నికలు, ఏపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు పనులు, తక్షణమే చేపట్టాల్సిన బాధ్యతల తర్వాత ఇటీవలనే పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యారు. దీంతో తను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు.

హరిహర వీరమల్లుకు కొత్త దర్శకుడు..
హరి హర వీరమల్లు చిత్రం మొదటి పార్ట్ ను ఇప్పటికే ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేశారు. ఇక తాజాగా టాలీవుడ్ కు చెందిన టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాను పర్యవేక్షించే బాధ్యతలను తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో భీమ్లా నాయక్ కు కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ హరిహర వీరమల్లుకు కూడా తానే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా రంగంలోకి దిగి ఈ హిస్టారికల్ మూవీని సరైన దిశగా నడిపిస్తున్నారు.
13 సార్లు వాయిదా.. ఎట్టకేళలకు షూటింగ్ పూర్తి..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఏకంగా 13 సార్లు వాయిదా పడ్డ సినిమాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. మొత్తానికి సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇవ్వాళ్టితో పూర్తి అవుతుండటం విశేషం. చివరిగా మే9కి విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ వాయిదా పడింది. ఇక ప్రస్తుతం మే30న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
హరిహర వీరమల్లు నటీనటులు, టెక్నీషియన్లు..
పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నోరా ఫతేహి, నర్గిస్ ఫక్రి, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో రూ.200 కోట్లతో నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











