'బిజినెస్ మ్యాన్'ఓపినింగ్స్ పై కొత్త డౌట్
మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ఈ నెల 13 న అత్యధిక ప్రింట్లతో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నైజాంలో రెండు వందల యాభై ప్రింట్లు వేస్తున్నారు. అందులో హైదరాబాద్ లోనే తొంభై ధియోటర్లలో విడుదల అవుతోంది. నిజానికి సంక్రాంతికి హైదరాబాద్ లో కర్ఫూ వాతావరణం నెలకొని ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాలనిమిత్తం ఇక్కడికి వచ్చిన చాలా మంది తమ తమ స్వంత ప్రాంతాలకు పండగకు వెళ్లిపోతారు. ఆ మూడు రోజులు తమ స్వస్ధలాల్లో గడుపుతారు. ఈ నేపధ్యంలో తొంభై ప్రింట్లతో హైదరాబాద్ లో విడుదల అయితే ఆ వారం అంతా హౌస్ ఫుల్ తో నడుస్తుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అవన్నీ అర్దం లేని అనుమానేలే అని ఓ వర్గం అంటోంది.
మహేష్ సినిమా అంటే మినిమం ఓ వారం పాటు టిక్కెట్లు దొరకని పరిస్ధితి ఉంటుందని,ధియోటర్స్ మొత్తం పండుగ వాతావరణంతో కళకళ్లాడతాయని,నిజానికి ధియోటర్లకు సంక్రాంతి కళ వస్తుందని చెప్తున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రం విడుదల కోసం చాలా చోట్ల ధియోటర్స్ లోని సౌండ్ సిస్టమ్ వంటివి బాగు చేయిస్తున్నారు. ఆ రోజున ఓ రేంజిలో తమ ధియోటర్స్ ని అలంకరించి బిజినెస్ మ్యాన్ ద్వారా వచ్చే బిజినెస్ కి ఆహ్వానం పలుకటానికి రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











