రామ్ చరణ్ పై కొత్త రూమర్
రామ్ చరణ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం డైరక్షన్ లో రామ్ చరణ్ వేలు పెట్టాడని, చాలా సీన్స్ తనే డైరక్ట్ చేసాడనే రూమర్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మొదటినుంచీ ఈ చిత్రం స్క్రిప్టులో పాల్గొన్నాడని, ఆ తర్వాత సంపత్ నంది మరీ ఒక చిత్రం డైరక్టర్ కావటంతో డైరక్షన్ విషయంలో తను ఇన్వాల్వ్ అయ్యాడని అంటున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ లోని నటనా ట్యాలెంట్ ని మాత్రమే కాక దర్సకుడుగా మరో కోణం కూడా ఆవిష్కరిస్తుందని గుసగుసలాడుతున్నారు.
అయితే ఇది ఎంతవరకూ నిజమనేది తెలియకపోయినా అంతటా ఇది చర్చనీయాంశంగా మారింది.ప్రేమిస్తే ప్రాణమిస్తాడు. అడ్డొస్తే... ఇక రచ్చ రచ్చే. ఇలాంటి మనస్తత్వం ఉన్న కుర్రాడే కధ రచ్చ. అతను సృష్టించిన హంగామా ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే కొంత కాలం ఆగండి అంటున్నారు దర్శక,నిర్మాతలు .ఎన్వీ ప్రసాద్, పారాస్‌జైన్ నిర్మాతలుగా రూపొందుతున్న ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
ఇక రచ్చ చిత్రంలో ఫైట్స్ కు బాగా ఫ్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్తున్నారు. అందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. చైనాలో బాంబో ఫారెస్ట్ లో తీసిన ఆ ఫైట్ సినిమాకు ప్రాణమై నిలుస్తుందని అంటున్నారు. ఆ ఫైట్ కోసం చరణ్ డూప్ ని కూడా పెట్టుకోకుండా తానే నటించాడని,ఆరెంజ్ తర్వాత వస్తున్న ఈ చిత్రం తన కెరీర్ కి ప్లస్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇక మెగా సూపర్‌గుడ్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏమైంది ఈ వేళ చిత్రంతో దర్శకుడుగా మారిన సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా కోసం కళా దర్శకుడు ఆనంద్‌సాయి ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు.మొదటి షెడ్యూల్ ని శ్రీలంకలో హీరో,హీరోయిన్స్ పై పాటను షూట్ చేసారు. వందశాతం మాస్ చిత్రమిదని,కమర్షియల్ అంశాలతో కూడిన చరణ్ పాత్ర తప్పకుండా అన్ని వయసులవారికీ నచ్చుతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఆర్.బి.చౌదరి, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











