Don't Miss!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
'భీష్మ' తెరవెనుక...
బెల్లంకొండ వద్ద బాలకృష్ణకు చెందిన మూడు సినిమాల డేట్స్ ఉన్నాయన్న రసవత్తరమైన చర్చ ఫిల్మ్ సర్కిల్ లో జరుగుతోంది.బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన అనంతరం బెల్లంకొండతో మూడు సినిమాలకు బాలయ్య డేట్స్ కమిట్ అయ్యారట. అయితే ఇక్కడ ఓ మెలిక ఉందట. ఆ మూడింటినీ బెల్లంకొండ స్వయంగా నిర్మించనూ వచ్చు. ఆ డేట్స్ ను వేరేవారికి (తనవాళ్లకు) బదలాయించనూ వచ్చట. అయితే మాటకు కట్టుబడటానికే బాలయ్య ఇప్పటికీ మొగ్గుచూపుతున్నారట. 'భీష్మ' ఇప్పటికే బెల్లంకొండ అనౌన్స్ చేసినందున మిగిలిన రెండు చిత్రాల విషయం తేలవలసి ఉంటుందని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. బెల్లంకొండ 'రైడ్' చిత్రం ఆడియో వేడుకకు బాలయ్య విచ్చేయడం, బాలయ్య పుట్టినరోజును తన చిత్ర యూనిట్ తో సహా బెల్లంకొండ జరుపుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. బాలయ్య బాబు డేట్స్ ఇస్తే వెంటనే సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సురేష్ ప్రకటించారు. ఇది జరిగిన వారం రోజులకే బాలకృష్ణతో 'భీష్మ' చిత్రాన్ని అనౌన్స్ చేయడం, పూజా కార్యక్రమాలు కూడా జరపడం చకచగా జరిగిపోయాయి. రమేష్ వర్మ ('రైడ్' ఫేమ్) దర్శకత్వంలో ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.