రామ్ గోపాల్ వర్మ 'నా ఇష్టం' పుస్తకానికి సీక్వెల్ టైటిల్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రిందటవారం "నా ఇష్టం" అనే పుస్తకం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్కకానికి ఆయన సీక్వెల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సీక్వెల్ పేరు "నేనంటే నా కిష్టం" అని చెప్తున్నారు. మరో ప్రక్క ఈ పుస్తకం ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇక నా ఇష్టం పుస్తకం మార్కెట్లోకి వచ్చిన రెండు రోజులకే కాపీలన్నీ అయిపోవటంతో మంచి డిమాండు ఉన్నదని అర్దం చేసుకున్న ఎమెస్కో వారు, వర్మ కలిసి ఈ సీక్వెల్ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం వర్మ..సునీల్ హీరోగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అనే చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ ప్రధానపాత్రలో రాజకీయ కథాంశంతో కుర్చీ అనే చిత్రం ప్లాన్ చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ అప్పలరాజు సునీల్ నా ఇష్టం నేనంటే నాకిష్టం ram gopal varma appalaraju sunil naa istam nenante naaku istam


Click it and Unblock the Notifications