19 ఏళ్లకే ఫహాద్ తో నజ్రియా పెళ్లి.. కథ నడిపించింది స్టార్ హీరోయిన్ అని తెలుసా?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా నజీమ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తన చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తన రూప సౌందర్యం, సినిమాలతో ఇక్కడ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. నజ్రియా నజీమ్ టాలీవుడ్ లో చేసింది కేవలం ఒకే ఒక్క సినిమా. నేచురల్ స్టార్ నాని సరసన 'అంటే.. సుందరానికీ' చిత్రంలో నటించింది. ఆ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

అయితే అంత కంటే ముందే ఈ బ్యూటీ 'రాజా రాణి' అనే చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం అయ్యింది. ఆ సినిమాలో చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. అట్లీ దర్శకత్వానికి కూడా ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నజ్రియా గురించి ఇంటర్నెట్ లో సంచలన వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో నజ్రియా నజీమ్ తన భర్త 'పుష్ప' విలన్, మలయాళ అగ్ర హీరో ఫహద్ ఫాజిల్ కు విడాకులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

A star Heroine Behind Nazriya Nazim Fahadh Faasil Marriage

తాజాగా నజ్రియా నజీమ్ ఈ విషయమై ఓ సంచలన పోస్ట్ కూడా షేర్ చేసింది. తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కొద్ది నెలలుగా తాను ఎక్కడా కనిపించకపోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందని, దాంతో తన స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులను కూడా కలవలేకపోయాయని చెప్పుకొచ్చింది. కొద్ది రోజులు ఆగితే ఆ విషయం ఏంటో మీకే తెలుస్తుందని కూడా సుదీర్ఘమైన నోట్ ద్వారా చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు.

పలువురు పలు రకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఫహాద్ ఫాజిల్ కు నజ్రియా విడాకులు ఇవ్వబోతున్నదని అభ్రిపాయ పడుతున్నారు. ఎంతగా రూమర్లు వచ్చినా అటు ఫహద్ ఫాజిల్, ఇటు నజ్రియా మాత్రం స్పందించడం లేదు. ఇంకొద్ది రోజుల్లో తానే అందరి ముందుకు వస్తానని చెప్పడంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. నజ్రియా నజీమ్ - ఫహద్ ఫాజిల్ 2014 జనవరి 11న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి వెనకాల ఒక స్టార్ హీరోయిన్ ఉందని తాజాగా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.

నజ్రియా నజీమ్ ఫహద్ ఫాజల్ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకునే సమయానికి నజ్రియాకు 19 ఏళ్లు, ఫహద్ ఫాజిల్ కు 32 ఏళ్లు.. వీరి మధ్య 13 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయితే వీరిద్ది మధ్య ప్రేమ ఎలా ఫుట్టిందని చాలా మంది సందేహిస్తూ ఉంటారు. కాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిత్యా మీనన్ కారణమని తమిళ మీడియా చెబుతోంది. అది పెద్ద మేటర్ కాకపోయినా ఆమె వల్లనే వీరద్దరూ ప్రేమలో పడ్డారని అంటున్నారు. 2014లో ఓ మూవీలో ఫహాద్ తో నిత్యామీనన్ నటించాల్సి ఉంది. కానీ తను ఒప్పుకపోవడంతో నజ్రియాను రెఫర్ చేసిందంట. ఇలా వారిద్దరిని కలిపిందని గాసిప్ అయితే వైరల్ అవుతోంది. ఇక పుష్ప చిత్రంతో ఫహద్ తెలుగు ఆడియెన్స్ లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నెక్ట్స్ పూరీ తో కలిసి డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X