కూలిలో మరో స్టార్ హీరో.. ఆయన పేరును ఎందుకు దాచారు? ఇంతకీ ఎవరంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కూలి మరో 4 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రజనీ జైలర్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కూలి చిత్రంతో ఎలాంటి సంచనాలు సృష్టించ బోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో సినిమాపై మరింతగా అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలో సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ తారాగణం..
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపుదిద్దకున్న చిత్రం కూలి. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షహిర్ కీలక పాత్రల్లో నటించడం విశేషం. ఇక గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇలా ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం మూలంగా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

A Surprising Role in Rajinikanth Coolie Movie

కూలిలో ఆ స్టార్ హీరో..
ప్రస్తుతం కూలి చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ స్పెషల్ వీడియోను కూడా విడుదల చేశారు. కూలి చిత్రంలో నటించిన స్టార్ కాస్ట్ గురించి, టాప్ టెక్నీషియన్ల గురించి చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో అద్భుతంగా అలరిస్తుందని హామీనిచ్చారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున విలన్ పాత్ర బాగా మెప్పిస్తుందని అన్నారు. దాంతో సినిమాపై కింగ్ రోల్ పై ఇంకా హైప్ పెరిగింది.

కానీ తాజాగా కూలి చిత్రంలో మరో స్టార్ హీరో కూడా నటించారని ప్రచారం జరుగుతోంది. ఆయన మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకేయ అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే అందరూ నటీనటుల గురించి చెప్పిన రజనీకాంత్, మేకర్స్ కార్తీకేయ గురించి మాత్రం చెప్పలేదు. కానీ స్ట్రాంగ్ బజ్ మాత్రం క్రియేట్ అయ్యింది. రజనీకాంత్ యంగ్ ఏజ్ లుక్ లో కార్తీకేయ కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే మాస్టర్ చిత్రంలో లోకేష్ కనగరాజ్ భవానీ పాత్రలో టీనేజ్ లో ఒకరని, పెద్దాయ్యాక విజయ్ సేతుపతిని చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అలాగే రిపీట్ చేయబోతున్నారని అంటున్నారు.

దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ బజ్ వినిపిస్తోంది. పూర్తిగా భారీ తారాగాణాన్ని ప్రకటించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్, చిత్ర యూనిట్ కార్తీకేయ పాత్రను ప్రకటించడంలో ఎందుకు దాపరికం చేస్తారని మరి కొందరు సందేహిస్తున్నారు. ఇక ఏదేమైనా దీనిపై స్పష్టత రావాలంటే ఆగస్టు 14 వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ చిత్రం 550 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసిందన ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X