ఫ్రిదా పింటో పై తెలుగు హీరో కన్ను

ఇక 'స్లమ్ డాగ్' లతిక హాలివుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధమైపోయింది. ఆమెను తీసుకున్న అలాంటిలాంటి వ్యక్తి కాదు. ఒకప్పటి మేటి హాస్య నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వుడీ అలెన్. ఎడతెరిపి లేని టెలివిజన్ ఇంటర్వ్యూలతో బిజీగా వున్న ఫ్రిదా పింటో మరో అడుగు ముందుకేసి, వుడీ అలెన్ హీరోయిన్ అయిపోతోంది. ఇరవై నాలుగేళ్ల ఈ ముంబాయి అమ్మాయి కెరీర్ లో ఈ చిత్రం అత్యద్భుతమైన బ్రేక్ త్రూ కానుంది. ఆదివారం ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్న అనంతరం ప్రసంగిస్తూ తనకు ఈ అవకాశం కల్పించిన వుడీ అలెన్ కు విశేషంగా ధన్యవాదాలు చెప్పుకుంది ఈ సుందరి. వుడి అలెన్..వాటేవర్ వర్క్స్ అనే చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఆ తరువాత అతడు నిర్మించబోయే, ఇంకా పేరు పెట్టని సినిమా జూలైలో సెట్లకు వెళ్లనుంది. దీనిలో ఫ్రిదా పింటో కు నటీ నటులు సర్ ఆంథోని హాప్ కిన్స్, జోష్ బ్రోలిన్ వంటి వారు నటిస్తున్నారు. అలాంటి ఆమెను మన హీరో తన ప్రక్కన చేయాలని పట్టుబడుతున్నాడు.


Click it and Unblock the Notifications











